Karimnagar: కరీంనగర్‌లో వడ్డీవ్యాపారులపై పోలీసుల దాడులు.. రూ. 52 లక్షల నగదు స్వాధీనం
కరీంనగర్ జిల్లాలో వడ్డీ వ్యాపారులపై కొరఢా ఝళిపిస్తున్నారు పోలీసులు. ఐదు, పది రూపాయల వడ్డీ వసూలు చేస్తూ బాధితులను పీల్చిపిప్పి చేస్తున్న ఫైనాన్స్ వ్యాపారుల భరతం పడుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో (Karimnagar )వడ్డీవ్యాపారుల ఆగడాలకు చెక్ పెడుతున్నారు పోలీసులు. బాధితుల ఫిర్యాదుతో దాడులు చేసిన పోలీసులు వడ్డీ వ్యాపారుల(moneylenders) ఆగడాలను చూసి షాక్ అయ్యారు. రెండు కాదు మూడు కాదు.. ఏకంగా ఐదు, పది రూపాయల వడ్డీ వసూలు చేస్తున్నట్లుగా గుర్తించారు. పైకి ఏదో వ్యాపారం పేరుతో బోర్డులను ఏర్పాటు చేసి.. లోపల మాత్రం వడ్డీ వ్యాపారం సాగిస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు దాడులతో వడ్డీ వ్యాపారుల గుట్టురట్టయింది. 37 చోట్ల దాడులు చేసిన పోలీసులు 52 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అధిక వడ్డీలతో దందా నడుపుతున్న 10 మందిపై కేసులు నమోదు చేశారు. ఇటీవల వడ్డీ దందాలపై బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
వడ్డీ దాందా చేస్తున్న వారి భరతం పట్టేందుకు ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించారు. ఏక కాలంలో దాడులు చేసిన పోలీసులు.. దందా నిర్వహిస్తున్న తీరును చూసి షాకయ్యారు. అధిక వడ్డీలతో వ్యాపారం చేస్తే సహించబోమని హెచ్చరించారు పోలీస్ కమిషనర్ సత్యనారాయణ.
దందాను మానుకోకపోతే కఠిన చర్యలు తప్పవన్నారు. పోలీసుల దాడుల్లో దొరికింది కొద్దిమందేనని.. పోలీసుల కన్నుగప్పి భారీగా దందా చేస్తున్నారని చెబుతున్నారు స్థానికులు. కొందరు అధిక వడ్డీకి డబ్బు ఇచ్చి.. తిరిగి చెల్లించకపోతే ఏకంగా ఆస్తులు రాయించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వడ్డీ దందాపై మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి: TS POLYCET 2022: తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఎప్పుడంటే..
చక్కని శరీర సౌస్ఠవం.. చూపు తిప్పుకోలేని అందం.. నడకలో రాజసం.. అయినా కష్టమొచ్చింది..