AP Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..
Prakasam District: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలోని కొత్తపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు
Prakasam District: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని యర్రగొండపాలెం మండలంలోని కొత్తపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు – ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ (Road Accident) ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయినట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్థానికుల నుంచి వివరాలు సేకరించామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. ఎర్రగుంటపాలెం మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన కొందరు మహిళలు మిరపకాయ కోత కోసం బోయలపల్లి వెళ్లారు. పని అనంతరం తిరిగి ఆటోలో ఇళ్లకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మార్కాపురం వెళుతున్న కారు.. మొగుళ్లపల్లి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కూలీలు, కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.
Also Read: