Surgery: ఆపరేషన్ కోసం వెళ్తే.. కడుపులోనే కాటన్ పెట్టి కుట్లేశారు.. వైద్యుల నిర్లక్ష్యంతో..

Medical Negligence: వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. ఆపరేషన్ చేసిన వైద్యుల ఆమె కడుపులోనే కాటన్ పెట్టి కుట్లు వేశారు. ఆ తర్వాత ఆమెకు కడుపునొప్పి రాగా..

Surgery: ఆపరేషన్ కోసం వెళ్తే.. కడుపులోనే కాటన్ పెట్టి కుట్లేశారు.. వైద్యుల నిర్లక్ష్యంతో..
Medical Negligence
Follow us

|

Updated on: Mar 24, 2022 | 2:56 PM

Medical Negligence: వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదికి తెచ్చింది. ఆపరేషన్ చేసిన వైద్యుల ఆమె కడుపులోనే కాటన్ పెట్టి కుట్లు వేశారు. ఆ తర్వాత ఆమెకు కడుపునొప్పి రాగా.. వైద్యులను సంప్రదిస్తే సాధారణ కడుపునొప్పి అంటూ ఇంటికి పంపారు. చివరకు ఆమె కడుపులో కాటన్ ఉన్నట్లు ఏపీలోని విశాఖపట్నం వైద్యులు గుర్తించి ఆపరేషన్ చేసి తొలగించారు. ఒడిశా (Odisha) లోని కోరాపుట్ జిల్లా బిరిగుడ గ్రామానికి చెందిన హలబ అనే మహిళకు కడుపునొప్పి రాగా.. ఆమెను రాయగడ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేర్చారు. దీంతో ఆమెకు వైద్యులు ఆపరేషన్ చేశారు. అనంతరం మీటర్ పొడవున్న కాటన్ ఆమె కడుపులోనే వదిలేసి వైద్యులు కుట్లు వేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత బాధితురాలికి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఆపరేషన్‌ చేసిన ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబసభ్యులు. అప్పుడు కూడా ఎలాంటి పరీక్షలు చేయకుండానే ఇది సాధారణ కడుపు నొప్పని చెప్పి పంపారు. అయితే.. నొప్పి తీవ్రం కావడంతో బాధితురాలు మరో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా.. మీటరు పొడవైన కాటన్‌ ఉన్నట్లు గుర్తించారు వైద్యులు.

దీంతో ఆమెను కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు ఆపరేషన్ చేసి వైద్యులు కాటన్‌ను తొలగించారు. అయితే రాయగడ వైద్యుల నిర్లక్ష్యంతో తమకున్న భూమి, బంగారాన్ని తాకట్టు పెట్టి ఆపరేషన్‌ చేయించామని బాధితురాలు కుటుంబం పేర్కొంది. కాగా.. వైద్యుల నిర్లక్ష్యంపై రాయగడ ఆసుపత్రి ఉన్నతాధికారులను సంప్రదించగా దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఆపరేషన్ కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ మేరకు వారు రాయగడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Also Read:

Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది.. కరెంట్ ఛార్జీల పెంపుపై బండి సంజయ్ ఫైర్

Hyderabad: త్వరలో హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైసెస్ తయారీ కంపెనీ కన్ఫ్లోయాంట్ మెడికల్ యూనిట్

Latest Articles
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
భారీ వర్షంతో గుజరాత్, కోల్‌కతా మ్యాచ్ రద్దు.. టైటాన్స్ ఇక ఇంటికే.
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
ఈ ఫొటోలోని అమ్మాయి ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్.. గుర్తు పట్టారా?
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
పదిహేనేళ్లుగా రికార్డ్ స్థాయిలో ఏపీ పోలింగ్ పర్సెంటేజ్
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
ఆర్సీబీకి పిడుగులాంటి వార్త.. స్వదేశానికి స్టార్ ప్లేయర్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
సిటీకి రిటన్ అయిన జనం.. రద్దీగా టోల్‌గేట్లు
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
వారణాసిలో అద్వితీయంగా సాగిన ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
'ప్లీజ్.. ఒక్కసారి తిరిగి రావా'.. 'త్రినయని' నటి మరణంపై భర్త
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
ఇంకా ఎన్నాళ్లు ఈ లేఆఫ్‌లు ?? సుందర్‌ పిచాయ్‌ సమాధానమిదే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
సమంత కంపెనీలో జాబ్‌ చేయాలనుకుంటున్నారా ?? ఆ అర్హత ఉండాల్సిందే
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!
ఇలా చేస్తే కటిక పేదవాడైనా సరే కుబేరుడవ్వాల్సిందే !!