AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: త్వరలో హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైసెస్ తయారీ కంపెనీ కన్ఫ్లోయాంట్ మెడికల్ యూనిట్

Hyderabad: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) .. అమెరికా (America) పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణా(Telangana) లో సరికొత్త పరిశ్రమల స్థాపన, పెట్టుబడులే లక్ష్యంగా..

Hyderabad: త్వరలో హైదరాబాద్‌లో ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైసెస్ తయారీ కంపెనీ కన్ఫ్లోయాంట్ మెడికల్ యూనిట్
Confluent Medical Unit In H
Surya Kala
|

Updated on: Mar 24, 2022 | 2:43 PM

Share

Hyderabad: ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR) .. అమెరికా (America) పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తెలంగాణా(Telangana) లో సరికొత్త పరిశ్రమల స్థాపన, పెట్టుబడులే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ డివైజెస్ తయారీ కంపెనీ కన్ఫ్లోయాంట్ మెడికల్ (Confluent Medical) సంస్థ హైదరాబాద్ లో తన తయారీ యూనిట్ ని ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. త్వరలో పైలట్ ప్రాతిపదికన ఒక తయారీ యూనిట్ ని మొదలు పెట్టి 12 నెలల్లో దాని భారీగా విస్తరించాలని కంపీనీ భావిస్తుంది. కంపెనీ నింతోల్ ఉత్పత్తుల తయారీ కోసం అగ్రశ్రేణి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్ నగరానికి తీసుకురానుంది. దేశంలో ఈ స్థాయి టెక్నాలజీతో ఉత్పత్తులను తయారు చేసే మొదటి కంపెనీ కన్ఫ్లోయాంట్ మెడికల్ గా నిలవనుంది. దేశంలోని మెడికల్ డివైసెస్ తయారీ కంపెనీలకు తన ఉత్పత్తుల ఆధారంగా సేవలను అందించనుంది. హైదరాబాదులో స్థాపించబోయే తన తయారీ యూనిట్ ద్వారా భారతదేశంతో పాటు ఆసియా ఖండంలోని తన ఖాతాదారులకు తన ఉత్పత్తులను సరఫరా చేయనుంది.

కన్ఫ్లోయాంట్ మెడికల్ సంస్థ అధ్యక్షులు మరియు సీఈవో అయిన డీన్ షావర్ ఈ రోజు అమెరికాలోని శాన్ హో నగరంలో మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. తమ సంస్థకు సంబంధించిన యూనిట్ ఏర్పాటు చేయనున్నామని ఈ సందర్భంగా ప్రకటించారు. భారతదేశానికి తొలిసారిగా అత్యంత ఆధునాతన టెక్నాలజీ ని తీసుకురావాలన్న లక్ష్యంతో హైదరాబాద్ నగరాన్ని తమ గమ్యస్థానంగా ఎంచుకున్నామని, భవిష్యత్తులో తమ కంపెనీని భారీగా విస్తరించే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని మంత్రి కేటీఆర్ కి తెలిపారు. త్వరలోనే తమ కంపెనీ బయోమెడికల్ టెక్స్టైల్ సేవలకు సంబంధించి ప్రణాళికలను ప్రకటిస్తామని తెలిపారు.

తమ తయారీ యూనిట్ ఏర్పాటు కోసం హైదరాబాద్ నగరాన్ని ఎంచుకున్నందుకు కన్ఫ్లోయాంట్ మెడికల్ టెక్నాలజీ సంస్థకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం మెడ్ టెక్ ప్రధాన రంగాల్లో మెడ్ టెక్ రంగం ఒకటని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సంస్థ తయారీ ప్లాంట్ యూనిట్ కి సంబంధించి అన్ని రకాల సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామని భవిష్యత్తులో సంస్థతో తెలంగాణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా పని చేద్దామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కే. తారకరామారావుతో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయెష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి నాగప్పన్ లు పాల్గొన్నారు.

Also Read: CM KCR: శ్రీమహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ దంపతులు.. ప్రత్యేక పూజలు