AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.. మూడు రాజధానులపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..

YS Jagan Mohan Reddy on AP Capitals: ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానుల వికేంద్రీకరణపై వెనకడుగు వేసే

YS Jagan: వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.. మూడు రాజధానులపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు..
Ys Jagan
Shaik Madar Saheb
|

Updated on: Mar 24, 2022 | 6:17 PM

Share

YS Jagan Mohan Reddy on AP Capitals: ఏపీ అసెంబ్లీలో వికేంద్రీకరణపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానుల వికేంద్రీకరణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. వ్యవస్థల పరిధిపై రాజ్యాంగం​స్పష్టత ఇచ్చిందంటూ పేర్కొన్నారు. రాజ్యాంగంలో ప్రతీ వ్యవస్థ స్వతంత్రమైనదేనని తెలిపారు. వ్యవస్థలు ఎవరి పరిధిలో వారు ఉంటే సమస్యలు రావని అ‍న్నారు. మిగిలిన వ్యవస్థలన్నీ సజావుగా సాగుతాయని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. చట్టాలు చేసే అధికారం శాసన వ్యవస్థకు ఉంటుందంటూ సీఎం జగన్‌ స్పష్టంచేశారు. శాసన వ్యవస్థ చట్టాలు చేయకూడదని కోర్టులు చెప్పలేవని తెలిపారు. చట్టాలు చేసే అధికారం శాసనవ్యవస్థకు ఉంటుందని తెలిపారు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు మరలా ఎన్నుకుంటారని తెలిపారు. రాజ్యాంగాన్ని, రాష్ట్ర అధికారాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. అమరావతి ప్రాంతంపై ప్రేమ ఉందని.. అందుకే తాను ఇక్కడ ఇల్లు కట్టుకున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. చట్టాలు నచ్చకపోతే ప్రజలే నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. మంచి చట్టాలు చేస్తే ప్రజలు మరలా ఎన్నుకుంటారని జగన్ అభిప్రాయపడ్డారు.

గత ప్రభుత్వం చేసిన విధానాలు నచ్చలేదు కాబట్టే ప్రజలు తమకు తీర్పు ఇచ్చారని.. ఇది ప్రజాస్వామ్య గొప్పతనమని తెలిపారు. ఆరు నెలల్లో రాజధానిని వేల కోట్లతో పూర్తి చేయాలని చెప్పడం.. సాధ్యం కాని టైం లైన్‌ను నిర్దేశించడం సరికాదంటూ సీఎం వ్యాఖ్యానించారు. మొదటి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి లేకపోవడం వల్ల వచ్చింది.. రెండోసారి తెలంగాణ ఉద్యమం అభివృద్ధి అంతా ఒకే దగ్గర ఉంటడం వల్ల వచ్చిందంటూ జగన్ పేర్కొన్నారు. వికేంద్రీకరణ వల్ల ఏపీ అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని కేంద్రం ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్‌ కమిటీనే చెప్పిందన్నారు.

ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకొని 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చామంటూ జగన్ పేర్కొన్నారు. ధర్మాసనంపై విశ్వాసం ఉందని.. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. అమరావతి రైతులకు అండగా ఉంటామని.. రైతుల ప్రయోజనాలను కాపాడుతామని పేర్కొన్నారు. అందరికీ మంచి చేయడానికే తమ ప్రభుత్వం ఉందన్నారు.

Also Read:

MP Vijayasai Reddy: పాకిస్తాన్ జైళ్లలో ముగ్గురు ఆంధ్రా జాలర్లు.. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు

PM Narendra Modi: ప్రధాని మోడీని కలిసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. పలు అంశాలపై చర్చ