Amazon: కరోనా టైంలో కోడింగ్ నేర్చుకున్న కూలీ కూతురు.. నేడు కష్టానికి తగిన ఫలం.. రూ.44 లక్షల వేతనంతో జాబ్

Amazon: సాధన చేస్తూ.. పదం కలిపితే సాధించలేని దేముంది..అంటుకుంటూ..కొంతమంది యువత తమకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని .. తమ ప్రతిభను నిరూపించుకుంటారు..

Amazon: కరోనా టైంలో కోడింగ్ నేర్చుకున్న కూలీ కూతురు.. నేడు కష్టానికి తగిన ఫలం.. రూ.44 లక్షల వేతనంతో జాబ్
Srikakulam Girl Amazon Job
Follow us
Surya Kala

|

Updated on: Mar 24, 2022 | 6:07 PM

Amazon: సాధన చేస్తూ.. పదం కలిపితే సాధించలేని దేముంది..అంటుకుంటూ..కొంతమంది యువత తమకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని .. తమ ప్రతిభను నిరూపించుకుంటారు. చదువుకోవాలి..మంచి ఉద్యోగం సంపాదించుకుని తమ తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా చూసుకోవాలని అనుకునే అమ్మాయిలు..  కష్టే ఫలి అంటూ సాప్ట్ వేర్ జాబ్(Software Jobs) నుంచి కూరగాయలు అమ్మే వరకూ ఏ పని అయినా చేస్తారు. తల్లిదండ్రుల పట్ల తమ భవిష్యత్ గురించి కన్న కలలను నిజం చేయడానికి పడిన కష్టానికి ఉదాహరణగా నిలిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా సాధారణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి.. ఇంకా ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోకుండానే భారీ వేతనంతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం సంపాదించి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళ్తే..

పలాస యువతికి అమెజాన్‌లో జాబ్. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన కె.స్నేహకిరణ్‌ అనే ఓ యువతికి అమెజాన్ భారీ ఆఫర్ ఇచ్చింది. ఆమె ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతుండగానే.. రూ.44 లక్షల వేతనంతో అమెజాన్‌కు ఎంపికయ్యారు. ఉద్యోగానికి ఎంపికైనట్లు మంగళవారం అమెజాన్ సంస్థ నుంచి స్నేహకిరణ్‌‌కు సమాచారం అందింది. దీంతో ఆ యువతి కుటుంబ సభ్యులు హర్ష వ్యక్తం చేస్తున్నారు. స్నేహకిరణ్‌ తండ్రి సింహాచలం స్థానికంగా జీడిపప్పు ఉత్పత్తి కర్మాగారంలో పనిచేస్తున్నారు. తల్లి సుభాషిణి గృహిణి. స్నేహకిరణ్‌ ప్రస్తుతం విశాఖపట్నంలోని ప్రైవేట్‌ కళాశాలలో సీఎస్‌ఈ లాస్ట్ ఇయర్ చదువుతుంది. భారీ వేతనంతో అమెజాన్ సంస్థకు ఎంపికైన స్నేహ కిరణ్ మాట్లాడుతూ.. తనకు చిన్నప్పటి నుంచే మ్యాథ్స్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టమని చెప్పారు. కరోనా సమయంలో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆన్‌లైన్ ద్వారా కోడింగ్ నేర్చుకున్నారని తెలిపారు. అంతేకాకుండా ఫ్రెండ్స్‌తో కలిసి గ్రూప్ డిస్కర్షన్స్ నిర్వహించేవారమని పేర్కొన్నారు. ఇవన్నీ తనకు ఇంటర్వ్యూలో ఉపయోగపడ్డాయని స్నేహకిరణ్ తెలిపారు.

Also Read: RRR First Review: ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. అద్భుత కళాఖండం.. చెర్రీ, తారక్ నటనకు గూస్‌బంప్స్ ఖాయమంటున్న ఉమర్

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!