AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cheating Case: ఫోర్జరీతో కార్ లోన్స్.. పక్కా ప్లాన్‌తో ఇరుక్కుపోయిన సాబూ కార్స్‌ డైరెక్టర్‌.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

Prashant Saboo Arrested: సాబూ కార్స్‌ సంస్థ డైరెక్టర్‌ ప్రశాంత్‌ సాబూ జైలుపాలయ్యారు. ఫోర్జరీ సంతకంతో కార్లపై రుణం తీసుకున్న ప్రశాంత్‌ సాబూను హైదరాబాద్ కార్ఖానా పోలీసులు బుధవారం

Cheating Case: ఫోర్జరీతో కార్ లోన్స్.. పక్కా ప్లాన్‌తో ఇరుక్కుపోయిన సాబూ కార్స్‌ డైరెక్టర్‌.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
Cheating Case
Shaik Madar Saheb
|

Updated on: Nov 25, 2021 | 11:56 AM

Share

Prashant Saboo Arrested: సాబూ కార్స్‌ సంస్థ డైరెక్టర్‌ ప్రశాంత్‌ సాబూ జైలుపాలయ్యారు. ఫోర్జరీ సంతకంతో కార్లపై రుణం తీసుకున్న ప్రశాంత్‌ సాబూను హైదరాబాద్ కార్ఖానా పోలీసులు బుధవారం అరెస్టు చేసి జైలుకు తరలించారు. అతనితో పాటు, సహకరించిన సుందరం ఫైనాన్స్‌ సంస్థపై హైదరాబాద్‌ కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేశారు. కార్ఖానా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌ సిఖ్‌విలేజ్‌లో ఉండే కె. వీరేందర్‌ రెడ్డి కూరా మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో నాన్‌ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు గత జూలై నెలలో సుందరం ఫైనాన్స్‌ సంస్థ ప్రతినిధులు రూ.40లక్షల రుణం చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. అయితే.. తాను కార్లు కొనేందుకు అప్పు తీసుకోలేదని కేవీ రెడ్డి తెలిపాడు. అయితే.. సాబూ మోటార్స్‌ డైరెక్టర్‌, మారేడ్‌పల్లిలో ఉంటున్న ప్రశాంత్‌ సాబూ అనే వ్యాపారి మీ గ్యారంటీతో రెండు కార్లు కొన్నాడని పేర్కొన్నారు. 2019 నవంబర్‌లో కార్ల కోసం రూ.40లక్షలు తీసుకున్నాడని రుణ సంస్థ సిబ్బంది వెల్లడించారు. ఈ మేరకు వీరేందర్‌ రెడ్డి సంతకాలతో ఉన్న లోన్‌ డాక్యుమెంట్లు చూపించారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన వీరేందర్‌రెడ్డి నవంబర్ 16న కార్ఖానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది.

వీరేందర్‌రెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. కేవీ రెడ్డికి సంబంధించిన పలు ఆధారాలను సుందరం ఫైనాన్స్‌ సంస్థకు అందించి, అతని సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి రెండు కార్లపై లోన్‌ను తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రశాంత్‌ సాబూకు జీఎస్‌ఎం కుమార్‌ అనే వ్యక్తి సహకరించాడని పోలీసులు తెలిపారు. రుణం తీసుకున్నా కార్లు కొనలేదని, ఫైనాస్స్ కంపెనీ కూడా దీని గురించి పట్టించుకోలేదని గుర్తించారు.

అనంతరం కార్ఖానా పోలలీసులు నిందితుడు ప్రశాంత్‌ సాబూను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రవీందర్‌ తెలిపారు. కాగా ప్రశాంత్‌ సాబూ ఇప్పటికే అనేకమందిని ఇదే తరహాలో మోసం చేశాడని, అమాయకులను బాధితులుగా మార్చాడనే ఆరోపణలు ఉన్నాయి. నిందితుడిపై చిలకలగూడ, తిరుమలగిరి పోలీసు స్టేషన్లలోనూ చీటింగ్‌ కేసులు నమోదైనట్లు పేర్కొంటున్నారు.

Also Read:

Crime News: దారుణం.. కన్నకూతురిపైనే అఘాయిత్యం.. ఆ తర్వాత తల్లికి తెలియడంతో..

Crime News: సహజీవనానికి అడ్డుగా ఉందని తల్లే చంపిందా..? మిస్టరీగా మారిన బాలిక మృతి

Cryptocurrency: ఇన్వెస్టర్ల వేధింపులు.. ప్రాణాలు తీసిన క్రిప్టో.. ఖమ్మం వాసి బలవన్మరణం..