Crime News: సహజీవనానికి అడ్డుగా ఉందని తల్లే చంపిందా..? మిస్టరీగా మారిన బాలిక మృతి
Girl Suspicious Death: ఆమె పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించి.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు దక్కించుకుంది. సరిగ్గా కళాశాలలో చేరాల్సిన క్రమంలో అనుమానాస్పద స్థితిలో
Girl Suspicious Death: ఆమె పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించి.. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సీటు దక్కించుకుంది. సరిగ్గా కళాశాలలో చేరాల్సిన క్రమంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆ తర్వత తల్లి, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి బాలిక మృత దేహాన్ని అటవీ ప్రాంతంలోకి తీసుకొని వెళ్లి పెట్రోల్ పోసి దహనం చేశారు. ఆపై ఎవరికీ తెలియకుండా పూడ్చి వేశారు. ఏపీలో కలకలం రేపిన ఈ దారుణ ఘటన ఒంగోలు జిల్లాలోని లింగసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాలెం ప్రాధమిక ఆరోగ్య ఉపకేంద్రంలో మాధవి ఏఎన్ఎమ్‌గా విధులు నిర్వహిస్తూ లింగసముద్రంలో ఉంటుంది. భర్తతో విభేధాలు రావడంతో 10 సంవత్సరాలుగా వేరేగా నివసిస్తోంది. మాధవికి ప్రశాంతి (15) ఏకైక కుమార్తె . మాధవి గత మూడేళ్లుగా అదేగ్రామానికి చెందిన శ్రీకాంత్‌తో సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో మాధవి కుమార్తె ప్రశాంతి ఇటీవల జరిగిన ట్రిపుల్ ఐటీ పరీక్షలలో ర్యాంక్ సాధించి నూజువీడు ట్రిపుల్ ఐటీలో సీటు సాధించింది. మంగళవారం కాలేజీ అడ్మిషన్ కోసం వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రశాంతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఆ తర్వాత తల్లి ప్రశాంతి మృతదేహాన్ని ఒకరోజు పాటు ఇంట్లోనే ఉంచింది. అనంతరం మాధవి, శ్రీకాంత్ కలిసి ప్రశాంతి మృతదేహాన్ని గ్రామ శివారులోని అటవీ ప్రాంతానికి తీసుకొని వెళ్లి దహనం చేశారు. బుధవారం ఉదయం శ్రీకాంత్, అతనికి సహకరించిన మరో వ్యక్తి అక్కడికి వెళ్లి చూడగా.. మృహాదేహం పూర్తిగా కాలిపోలేదని గుర్తించి.. కాలువలో గుంత తీసి పూడ్చివేశారు.
అయితే.. దీనిపై గ్రామస్థులు ప్రశ్నించగా.. మాధవి, శ్రీకాంత్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు మాధవి, శ్రీకాంత్, వారికి సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు. అటవీ ప్రాంతంలో ఎక్కడ దహనం చేశారో ఆప్రాంతానికి తీసుకొని వెళ్లి పలు వివరాలు సేకరించారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్న ప్రశాంతి మరణం మిస్టరీగా మారింది. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే అసలు విషయాలు బయటపడతాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు.
కాగా.. వివాహేతర సంబంధానికి ప్రశాంతి అడ్డుగా మారిందని.. మాధవి, శ్రీకాంత్ కడతేర్చి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. మాధవి, శ్రీకాంత్.. ప్రశాంతి మరణంపై పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Also Read: