Crime News: దారుణం.. కన్నకూతురిపైనే అఘాయిత్యం.. ఆ తర్వాత తల్లికి తెలియడంతో..
Girl raped by father: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కూతురు పాలిట కామాంధుడిలా మారాడు. ఆమెపై
Girl raped by father: తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కూతురు పాలిట కామాంధుడిలా మారాడు. ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేశాడు. ఈ దారుణ సంఘటన జిల్లాలోని మోమిన్‌పేటలో వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోమిన్‌పేటకు చెందిన ఓ వ్యక్తి బతుకు దేరువుకోసం కుటుంబంతో సహా వచ్చి హైదరాబాద్‌లోని పఠాన్ చెర్వు ప్రాంతంలో నివాసముంటున్నాడు. ఆ దంపతులకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల పెద్ద కుమార్తె అనారోగ్యానికి గురికాగా.. ఆమెను తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లింది. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని తెలిసింది.
దీంతో తల్లి.. బాలికను నిలదీసింది. తన గర్భానికి కారణం కన్నతండ్రి అని.. ఇంట్లో ఎవరు లేని సమయంలో తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు రోదించింది. ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తానని బెదిరించాడని.. గత కొంతకాలంగా తండ్రి తనను వేధిస్తున్నట్లు తెలిపింది. దీంతో తల్లి.. కూతుళ్లను తీసుకొని సొంత గ్రామం మోమిన్ పేటకు చేరుకొని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న మోమిన్ పేట పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. కాగా.. అత్యాచారానికి గురైన బాలిక పెద్ద కూతురు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కామాంధుడిని శిక్షించాలంటూ పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
Also Read: