కమీషన్లకు కక్కుర్తిపడి సొంత ఇంటిని దోచారు.. కేడీలుగా మారిన మేనేజర్లు..

దొంగలంతా ఒకటే చోట చేరిపోయారు. అందినకాడికి దోచుకునేందుకు ప్లాన్ చేశారు. అందరూ కలిసి ప్రభుత్వ కార్పొరేషన్లను ముంచేశారు. కోట్లాది రూపాయలను కొల్లగొట్టారు.

కమీషన్లకు కక్కుర్తిపడి సొంత ఇంటిని దోచారు.. కేడీలుగా మారిన మేనేజర్లు..
Case Registered
Follow us

|

Updated on: Nov 25, 2021 | 2:48 PM

దొంగలంతా ఒకటే చోట చేరిపోయారు. అందినకాడికి దోచుకునేందుకు ప్లాన్ చేశారు. అందరూ కలిసి ప్రభుత్వ కార్పొరేషన్లను ముంచేశారు. కోట్లాది రూపాయలను కొల్లగొట్టారు. తాడిగడప సప్తగిరి గ్రామీణా బ్యాంకులో సొమ్ము కొట్టేయాలని ప్లాన్ చేశారు. దీనికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. తీరా అమలు చేయాల్సిన సమయానికి దొరికిపోయారు. దీంతో ప్రభుత్వ సంస్థల సొమ్ము దొంగల చేతికి చిక్కకుండా ఆగిపోయింది. ఆయిల్‌ఫెడ్‌, గిడ్డంగుల సంస్థకు చెందిన ఎఫ్‌డీల కుంభకోణానికి సంబంధించి పోలీసుల దర్యాప్తులో అనేక కీలకమైన సంగతులు బయటపడుతున్నాయి.

గిడ్డంగుల సంస్థకు చెందిన రూ. 11.4 కోట్ల ఎఫ్‌డీలను స్వాహా చేసేందుకు చేసిన ప్రయత్నం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు బయటపడిన రూ. 16 కోట్ల కుంభకోణం కాకుండా రెండో ప్రయత్నంలో ఎఫ్‌డీఆర్‌లను నకిలీ లేఖలతో డ్రా చేసేందుకు ప్రయత్నించారు. దీనికి సంబంధించి ఆత్కూరు, పెనమలూరు పోలీసుస్టేషన్లలో ముఠాపై కేసులు నమోదు చేశారు. బ్యాంకు మేనేజర్ పూర్ణ సహా 9 మంది నిందితులపై కేసు నమోదయ్యింది. భవానీపురం, వీరపనేనిగూడెంలో ఏపీ స్టేట్ వేరేహౌస్ కార్పొరేషన్ , ఏపీ కో-ఆపరేటివ్ అయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ డిపాజిట్ గల్లంతు కాకుండా మిగిలింది.

ఇప్పటికే పలువురుని అరెస్ట్ చేసిన పోలీసులు. కోర్టు అనుమతితో నిందితులను విచారించారు సీసీఎస్ పోలీసులు. నకిలీ పత్రాలతో సొమ్మును కొట్టేసేందుకు తాడిగడప సప్తగిరి బ్యాంక్ మేనేజర్ పూర్ణ, పలువురు స్కెచ్ వేశారు. భవానీపురం, అత్కూరు పీఎస్ లో నమోదైన కేసుల విచారణలో వెలుగు చూసిది.

నిందితుల నుంచి సంచలన నిజాలు ..

తాడిగడపలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజరుగా బదిలీ అయ్యారు. తనకు ఉన్న పూర్వ పరిచయాలతో రాష్ట్ర గిడ్డండుల సంస్థకు వెళ్లి అధికారులను కలిశారు. తాను తాడిగడప శాఖకు బదిలీ అయ్యానని, ఇక్కడ కూడా ఎఫ్‌డీలు చేయమని అడిగారు. అధికారులు రూ. 9.4 కోట్లు డిపాజిట్‌ చేశారు. 2021లో నకిలీ ధ్రువీకరణ పత్రాలతో ఎఫ్డిఆర్ నిధులు కొట్టేసేందుకు యత్నం చేశారు. ఇక్కడ కూడా అసలు బాండ్లను తమ వద్ద ఉంచుకుని, నకిలీ పత్రాలను గిడ్డంగుల సంస్థకు ఇచ్చారు. గిడ్డంగుల సంస్థ ఉన్నతాధికారులు ఇచ్చినట్లుగా నకిలీ ఆథరైజేషన్‌ లేఖలు సృష్టించారు. వీటి ఆధారంగా డిపాజిట్ల సొమ్ము పక్కదారి పట్టించడానికి పథకం వేశారు. ఇంతలోనే ఈ ముఠా హైదరాబాద్‌లో అరెస్టు అవడంతో కథ అడ్డం తిరిగింది. ఇందులో.. సాయికుమార్, నండూరి వెంకటరామన్, మరీడు వెంకటేశ్వరరావు, వై.సోమశీ ఖర్, పి.గోవిందరాజులు, జి. వెంకటకృష్ణారెడ్డి, మదన్ ఆర్జునా సాగర్, పి. యోహాన్ రాజు పూర్వ బ్యాంకు మేనేజర్ వెంకటరామిరెడ్డితో కలిసి స్కెచ్ వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు సీసీఎస్ పోలీసులు.

ఇవి కూడా చదవండి: TRS: ఎమ్మెల్సీగా ఎన్నికైన కవితకు వీరాభిమాని బిగ్ విషెస్.. ఏం చేశాడో చూశారా..

Kashi Vishwanath Temple: కాశీ విశ్వనాథ ఆలయంలో దర్శనాలు నిలిపివేత.. సుందరీకరణలో భాగంగా ఈ నిర్ణయం..

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!