OTT Pirates: ఓటీటీలకు పైరసీ దెబ్బ.. తోప్ టీవీ యాప్ మాయాజాలం.. సీఈఓ అరెస్ట్

ఓటీటీలకు కూడా పైరసీ బాధ తప్పడం లేదు. థియేటర్‌లో విడుదలైన సినిమాలను పైరసీ చేసినట్టే, ఓటీటీల్లోని సినిమాలను కూడా పైరసీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.

OTT Pirates: ఓటీటీలకు పైరసీ దెబ్బ.. తోప్ టీవీ యాప్ మాయాజాలం.. సీఈఓ అరెస్ట్
Thop Tv Ceo Arrested
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 15, 2021 | 1:11 PM

ఓటీటీలకు కూడా పైరసీ బాధ తప్పడం లేదు. థియేటర్‌లో విడుదలైన సినిమాలను పైరసీ చేసినట్టే, ఓటీటీల్లోని సినిమాలను కూడా పైరసీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. తాజాగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న కంటెంట్‌ని ఫ్రీగా తన యాప్‌లో ప్రసారం చేస్తున్న తోప్‌ టీవీ సీఈవోను పోలీసులు అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. శాటిలైట్‌ ఛానల్స్‌, ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లోని తమ కంటెంట్‌ని పైరసీ చేశాడని పోలీసులకు ఫిర్యాదులు రావడంతో ముంబైలోని పోలీసులు, హైదరాబాద్‌లోని తోప్‌ టీవీ సీఈవోను అరెస్ట్‌ చేసి ముంబైకి తరలించారు. వయాకామ్‌ 18 మీడియాతో పాటు మరికొంత మంది ఓటీటీ నిర్వాహకులు అతడిపై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఓటీటీలో సినిమాలు విడుదల చేయడం ఎంత వరకు సేఫ్‌.. ? వాటిలోని కంటెంట్‌ని పైరసీ కాకుండా ఎలా చూడాలనే కొత్త సమస్య మొదలైంది. ఇప్పటికే థియేటర్లు లేక, సినిమాలు విడుదల కాకపోవడంతో ఉపాధి లేక అల్లాడుతున్న సినీ పరిశ్రమకు ఈ కొత్త సమస్య తలనొప్పిగా మారింది. దీంతో ఓటీటీలో పైరసీని ఆపేదెలా అని తలలు పట్టుకుంటున్నారు సినీ పెద్దలు.

కరోనా ఫస్ట్‌ వేవ్‌ తర్వాత ఓటీటీల వినియోగం బాగా పెరిగింది. నెట్‌ఫ్లిక్స్‌, అమేజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌, జీ5, ఆహా లాంటి ఓటీటీలు చాలా వరకు సక్సెస్‌ అయ్యాయి. దీంతో వీటిలో ఉన్న కంటెంట్‌ని పైరసీ చేసి కొందరు తమ సొంత యాప్‌లలో ప్రసారం చేస్తున్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన ఓటీటీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తోప్‌ టీవీ యాప్‌ సీఈవోను అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని గుర్రంగూడలో నివసిస్తున్న సతీష్‌ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గత రెండేళ్లుగా తోప్‌ టీవీ యాప్ నిర్వహిస్తున్నాడు. అయితే హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకు సినిమాలను తోప్‌ టీవీ యాప్‌లో ప్రసారం చేస్తున్నాడు. దీంతో వయా కామ్‌ 18 మీడియాతో పాటు మరికొందరు నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తోప్‌ టీవీ సీఈవోను అరెస్ట్‌ చేశారు.వెంకటేష్‌ నటించిన నారప్ప, దృశ్యం 2, రానా నటించిన విరాట పర్వం, నితిన్‌ మ్యాస్ట్రో, త్వరలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల కాబోతున్నాయి. దీంతో పెద్ద నిర్మాతలకు పైరసీ భయం పట్టుకుంది.

Also Read: హైదరాబాద్‌లో కుండపోత వర్షం… పోటెత్తిన వరద.. వరదలో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కారు

 పాము, ముంగిసల మధ్య భీకర యుద్దం.. ఎవరు గెలిచారంటే..?