AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనంతపురం జిల్లాలో దారుణం.. 100 బస్తాల శనగపంటను తెల్లారేసరికి బుగ్గిగా మార్చేశారు.. కౌలు రైతు కన్నీరు

ఏపీలో పంచాయతీ పోరు పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీయగా, మరికొన్ని చోట్ల కక్ష సాధింపులకు చర్యలకు తెరతీసింది. అనంతపురం జిల్లాలో...

అనంతపురం జిల్లాలో దారుణం.. 100 బస్తాల శనగపంటను తెల్లారేసరికి బుగ్గిగా మార్చేశారు.. కౌలు రైతు కన్నీరు
Ram Naramaneni
|

Updated on: Feb 22, 2021 | 9:23 PM

Share

ఏపీలో పంచాయతీ పోరు పలు చోట్ల ఉద్రిక్తతలకు దారి తీయగా, మరికొన్ని చోట్ల కక్ష సాధింపులకు చర్యలకు తెరతీసింది. అనంతపురం జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు పగలు పెంచుకున్నారు. ఓ పార్టీ సానుభూతి పరులపై మరోపార్టీకి చెందిన వారు కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు.

ఉరవకొండ మండలం గాజుల మల్లాపురం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సానుభూతిపరుడు బోయ రామాంజనేయులుకు చెందిన శనగ పంటకు అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు నిప్పు పెట్టారు. రామాంజనేయులు కౌలు రైతు. రాత్రనకా, పగలనక శ్రమించి పండించిన పంట గత నాలుగు రోజుల క్రితం తేలికపాటి జల్లులు పడడంతో పొలంలోనే కుప్పగాపోసి, పాడవకుండా టార్పాలిన్ కప్పి ఉంచాడు. గత అర్ధరాత్రి దాటాక ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు పంట కొప్పులకు నిప్పు పెట్టినట్టు రామాంజనేయులు వాపోయారు.

తాము ఎవరికీ ఎలాంటి ద్రోహం చేయలేదని, గిట్టనివారు తమపై కక్ష పెంచుకుని ఈ పనికి పాల్పడ్డారని రామాంజనేయులు కుటుంబసభ్యులు కన్నీరుపెట్టుకున్నారు. పదెకరాలలో పండిన దాదాపు వంద బస్తాలు దిగుబడి వచ్చే కుప్ప కు నిప్పు పెట్టారు దుండగులు. దీంతో తమకు కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది, తమను ఆదుకోవాలని రామాంజనేయులు వేడుకుంటున్నారు. దుండగులను పోలీసులు పట్టుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Also Read:

నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది

చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీనే.. దెయ్యమే చంపిందా..?.. షాకింగ్ వీడియో