దారి కాసి.. దాడి చేసి.. దోచుకుంటున్న దోపిడీ దొంగలు.. ఆ ఘాట్‌రోడ్డులో తస్మాత్ జాగ్రత్త..

విశాఖ ఏజెన్సీ దారాలమ్మ ఘాట్‌రోడ్డులో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికులపై దాడి చేసి..నగదుతో పాటు వాహనాన్ని ఎత్తుకెళ్లారు.

దారి కాసి.. దాడి చేసి.. దోచుకుంటున్న దోపిడీ దొంగలు.. ఆ ఘాట్‌రోడ్డులో తస్మాత్ జాగ్రత్త..
attack
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 22, 2021 | 9:48 PM

విశాఖ ఏజెన్సీ దారాలమ్మ ఘాట్‌రోడ్డులో మరోసారి దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికులపై దాడి చేసి..నగదుతో పాటు వాహనాన్ని ఎత్తుకెళ్లారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దాడిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

విశాఖ జిల్లా జీకే వీధి మండలం కమ్మరపల్లి ప్రాంతానికి చెందిన అప్పారావు..అనే గిరిజనుడికి అనారోగ్యం కావడంతో..అతన్ని స్కార్పియోలో వాహనంలో నర్సీపట్నంకు తెల్లవారుజామున తరలిస్తున్నారు. వాహనం దారాలమ్మ ఘాట్‌రోడ్డులో వచ్చే సరికి..ఆగిపోయింది. కార్‌ స్టార్ట్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగానే..ఇంతలో సినీ ఫిక్కీలో అకస్మాత్తుగా దొంగలు వచ్చారు. తుపాకీ, మారణాయుధాలతో బెదిరించి డ్రైవర్‌ దొరబాబుపై దాడి చేశారని బాధితులు వాపోతున్నారు.వారి దగ్గరున్న 20 వేల నగదు, సెల్‌ఫోన్‌తో పాటు వారి వాహనాన్ని కూడా తీసుకుని పారిపోయారు. బాధితులు ఎలాగోలా అవస్థలు పడుతూ విషయం పోలీసులకు చెరవేశారు.

విషయం తెలుసుకున్న జీకే వీధి సీఐ మురళీధర్‌… స్వాట్‌కు చేరుకున్నారు. దారకొండ, సీలేరులోని సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ మధ్య కాలంలో దారాలమ్మ ఘాట్‌రోడ్డులో దొంగలు వరుస దాడులతో ప్రజల్ని హడలెత్తిస్తున్నారు. దారినపోయే వాహనాలను అడ్డుకుని దాడులు, దోపిడీలకు పాల్పడుతున్నారంటూ స్థానిక ప్రజలతో పాటు, వాహనదారులు, ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది

చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీనే.. దెయ్యమే చంపిందా..?.. షాకింగ్ వీడియో

తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
తెలంగాణ విద్యుత్ రంగంలో వచ్చే పదేళ్లలో 1.14 లక్షల కొత్త ఉద్యోగాలు
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
ఆ హీరో వల్లే నాకు పెళ్ళికాలేదు..
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
త్వరలోనే భారత్‌లో బుల్లెట్‌ ట్రైన్‌: ప్రధాని మోదీ
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
కొబ్బరి పువ్వు కనిపిస్తే లేట్ చేయకుండా తినండి..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
వైకుంఠ ఏకాదశి రోజున ఈ పరిహారాలు చేస్తే మోక్షం.. అవి ఏమిటంటే..
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
'డాకు మహారాజ్'లో నేషనల్ అవార్డు అందుకున్న టాలీవుడ్ డైరెక్టర్
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు.. కెప్టెన్‌గా లేడీ కోహ్లీ
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కళ్లు ఉబ్బిపోయి ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో రిలీఫ్ పొందండి!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
కానిస్టేబుల్‌ అభ్యర్ధులకు అలర్ట్.. దేహదారుఢ్య పరీక్షలు వాయిదా!
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం
వైరస్‌తో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్‌.. రూ.10 లక్షల కోట్లు నష్టం