చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీనే.. దెయ్యమే చంపిందా..?.. షాకింగ్ వీడియో

ఓ యువతి హెటల్‌లో కనిపించకుండా మాయమైంది. రోజులు గడుస్తున్నా ఆమె జాడ తెలియలేదు. దీంతో పేరెంట్స్ కంగారుపడి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాప్స్ ఎంట్రీ ఇచ్చి హెటల్‌లో సెర్స్ చేసినా...

  • Ram Naramaneni
  • Publish Date - 7:02 pm, Mon, 22 February 21
చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీనే.. దెయ్యమే చంపిందా..?.. షాకింగ్ వీడియో

Death Of Elisa Lam: ఓ యువతి హెటల్‌లో కనిపించకుండా మాయమైంది. రోజులు గడుస్తున్నా ఆమె జాడ తెలియలేదు. దీంతో పేరెంట్స్ కంగారుపడి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాప్స్ ఎంట్రీ ఇచ్చి హెటల్‌లో సెర్స్ చేసినా కూడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు.  దీంతో సీసీ టీవీ విజువల్స్ సెర్స్ చేశారు.   ఆమె అదృశ్యం అయినరోజు చివరిసారిగా లిఫ్టులో కనిపించింది. ఆ లిఫ్ట్‌లో ఆమె చాలా కలవరపాటుకు గురైంది. లిఫ్టులోని బటన్స్ నొక్కినా డోర్స్ మాత్రం క్లోజ్ కాలేదు. మధ్యమధ్యలో భయంగా తొంగిచూసింది. ఆ తర్వాత తన వద్దకు ఎవరో వచ్చినట్లు  ప్రవర్తించింది. చివరికి ఊహించని విధంగా అదే హోటల్‌ వాటర్ ట్యాంకులో డెడ్‌బాడీగా కనిపించింది.  అసలు ఆమెను ఎవరు చంపారు? ఆమె దేన్ని చూసి భయపడింది. కొందరు అంటున్నట్లుగా దెయ్యమే ఆమెను చంపిందా.. ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దక్కలేదు.


2013లో జరిగింది ఈ ఘటన. ఆ యువతి పేరు ఎలిసా లామ్(21). కెనడా కాలేజ్‌లో చదువుతుంది. ఈ విద్యార్థిని జనవరి 31న లాస్ ఏంజిల్స్‌లోని సెసిల్ హోటల్‌లో గది అద్దెకు తీసుకుంది. ఆ తర్వాత అకస్మాత్తుగా అదృశ్యమైంది. హోటల్‌‌లో లిఫ్టులోని ఓ సీసీటీవీ విజువల్స్ పరిక్షించిన పోలీసులు.. ఆమె ఎవరినో చూసి భయపడతున్నట్లుగా అర్థమయ్యమింది. లిఫ్టులో అన్ని బటన్లు ప్రెస్ చెయ్యడం.. భయపడుతూ బయటకు తొంగి చూడటం వంటి పనులు చేసింది. ఆమె ఎన్ని బటన్స్ నొక్కినా లిఫ్ట్ మాత్రం క్లోజ్ అవ్వపోవడం గమనార్హం. చివరికి ఆమె బయటకు వచ్చి ఎవరితోనో మాట్లాడుతున్న సమయంలో లిఫ్టు తలుపులు మూసుకున్నాయి.. ఆ సమయంలో ఆమె ఎదురుగా ఎవరూ కనిపించలేదు. ఆ తరువాత ఆమె ఎలా చనిపోయింది అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఎలిసా బైపోలార్ డిజార్డర్‌తో బాధపడుతోందని, దాని నుంచి బయటపడేందుకు ఆమె మెడిసిన్ తీసుకొనేందని పోస్టుమార్టం రిపోర్టులో డాక్టర్లు స్పష్టం చేశారు. ఆ వ్యాధి కారణంగానే  తనని ఎవరో వెంటాడుతున్నట్లు భావించి ఉండొచ్చని మానసిక వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె హోటల్ నీటి ట్యాంకుల మీదకు ఎక్కి నీటిలోకి దూకి ఉండవచ్చని, పైకి రాలేక అందులోనే మునిగి చనిపోయి ఉండవచ్చని పేర్కొన్నారు.

అయితే ఎవరైనా వాటర్ ట్యాంక్ మూత తెరిస్తే వెంటనే హోటల్ రిసెప్షన్‌లో అలారం మోగుతుంది. ఆ రోజు ఎలిసా వాటర్ ట్యాంక్ మూత తెరిచినప్పుడు కూడా ఆ అలారం మోగాలి కానీ, అలా జరగలేదన్నది.. ఆమె లిఫ్ట్ బటన్స్ నొక్కినప్పుడు డోర్స్ ఎందుకు క్లోజ్ కాలేదన్నని అంతుచిక్కని ప్రశ్నలే.

ఎలిసా కేసు గురించి పోలీసులు వెల్లడించిన విషయాలు..దిగువ వీడియోలో..

 

Also Read:

ఓటీటీ ఎపిసోడ్ల మాదిరిగా పోర్న్ కంటెంట్.. వారానికో ఎపిసోడ్ రిలీజ్.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు

నల్లగా ఉన్నావ్.. వదిలేసి.. మరొకర్ని పెళ్లి చేసుకుంటానన్న భర్త.. భార్య ఊహించని పని చేసింది