విశ్వాసానికి మారు పేరు కుక్క.. అన్నం పెట్టిన యజమాని కోసం ఈ శునకం ఏం చేసిందో మీరే చూడండి..

ప్రపంచంలో ఉన్న జీవులన్నిటిలో విశ్వాసం పేరు చెప్పగానే గుర్తూచే జంతువు కుక్క. ప్రేమగా పిడికెడు అన్నం పెడితే చాలు మనకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడడు కుక్క

విశ్వాసానికి మారు పేరు కుక్క.. అన్నం పెట్టిన యజమాని కోసం ఈ శునకం ఏం చేసిందో మీరే చూడండి..
Follow us
Rajeev Rayala

| Edited By: uppula Raju

Updated on: Feb 22, 2021 | 10:23 PM

viral video : ప్రపంచంలో ఉన్న జీవులన్నిటిలో విశ్వాసం పేరు చెప్పగానే గుర్తొచ్చే జంతువు కుక్క. ప్రేమగా పిడికెడు అన్నం పెడితే చాలు మనకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడదు కుక్క. ఎన్నోసందర్భాల్లో యజమానుల కోసం పెంపుడు కుక్కలు పోరాడటం మనం చూసాం.. తమ వారిని కాపాడటానికి కుక్కలు ఏమైనా చేస్తాయి. అయితే తమ యజమానుల కోసం కుక్కలు చేసే పనులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తాయి. మరి కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ కుక్క తన యజమాని కోసం చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

కుక్కలు మనుషులతో కలిసి జీవించడంద్వారా అవి కూడా ఎంతో బాధ్యతగా మెలుగుతుంటాయి. సరిగ్గా అలాంటి వీడియోనే ఇది. ఈ వీడియోలో ఓ చిన్నారి నదిలో పడిన తన బంతి కోసం నీటిలోకి దిగే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో అక్కడ ఉన్న పెంపుడు కుక్క ఆ చిన్నారిని నీటిలోకి దిగకుండా అడ్డుకుంటుంది. నోటితో ఆ పాప డ్రస్ ను పట్టుకొని వెనకకు లాగేస్తుంది. అనంతరం ఆ కుక్క నీటిలోకి దిగి ఆ బంతి తెచ్చి పాపకు అందిస్తుంది. ఈ వీడియో పాతదే అయిన నెటిజన్లు మరోసారి ఈవీడియోను గుర్తు చేసుకుంటూ షేర్ చేస్తున్నారు. దాంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Crocodile Attack on Deer Video: మొసలికి ఆహారంగా మారి తల్లి జింక బలి..బిడ్డ కోసం.