Rajinikanth style : సూపర్ స్టార్ స్టైల్‌లో దోశలు.. ధోని రేంజ్‌లో క్యాచ్‌లు… నెట్టింట వైరల్ అవుతున్న తలైవా దోశ…వీడియో వైరల్
తినే దోశల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఉప్మా దోశ, మసాలా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ, చికెన్ దోశలు మాత్రమే కాదు.. ఆకరికి ఫ్లయింగ్ దోశలను కూడా చూశాం. ఇప్పుడు తాజాగా.
Viral video : మనం తినే దోశల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. ఉప్మా దోశ, మసాలా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ, చికెన్ దోశలు మాత్రమే కాదు.. ఆకరికి ఫ్లయింగ్ దోశలను కూడా చూశాం. ఇప్పుడు తాజాగా.. ముంబై వాసులను తెగ ఆకట్టుకుంటుంది మరో స్టైల్ దోశ. దాని పేరే సూపర్ స్టార్ రజినీకాంత్ దోశ. రజినీకాంత్ దోశ స్పెషాలిటీ ఏంటో ఇప్పుడుచూద్దాం. రజినీకాంత్‌కు వీరాభిమాని అయిన ముత్తు అనే వ్యక్తికి ముంబైలోని దదర్ రోడ్డ్‌లో’ముత్తు దోశ సెంటర్’ అనే పేరుతో ఓ హోటల్ నడుపుతున్నాడు. అయితే.. క్షణంలో అవలీలగా దోశలను వేసి.. కస్టమర్ల ప్లేట్స్‌లోకి దోశను విసిరే స్టైల్‌కు ఫిదా అవుతున్నారు నెటిజన్స్. ఇందంత ఒక తీరైతే.. ఆ దోశను ప్లేట్‌లో పట్టుకుని యువకుడి స్ట్రైల్ ఇంకో రేంజ్‌లో ఉంది. ధోని కీపింగ్ స్టైల్ లో దోశలను పట్టుకొని కస్టమర్లకు అందిస్తున్నాడు. ఇక ముత్తు స్టైల్‌కు మాత్రమే కాదు.. ముత్తు చేసిన దోశలకు కూడా అంతే క్రేజ్ ఉంది. ముంబైలోని చాలా ప్రాంతాల నుంచి రజినీదోశలతో పాటు పలు దోశలకు చాలా క్రేజ్ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.