పెద్దపల్లి ఘటన మరువకముందే మరో ఘటన.. హైకోర్టు న్యాయవాది కారును ఢీ కొట్టిన లారీ..

పెద్దపల్లి న్యాయవాదుల మర్డర్ కేసు ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. జనగామ జిల్లా యశ్వంత్‌పూర్ సమీపంలోని హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ..

  • Sanjay Kasula
  • Publish Date - 8:48 pm, Mon, 22 February 21
పెద్దపల్లి ఘటన మరువకముందే మరో ఘటన.. హైకోర్టు న్యాయవాది కారును ఢీ కొట్టిన లారీ..

Lorry Hit by Car:పెద్దపల్లి న్యాయవాదుల మర్డర్ కేసు ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. జనగామ జిల్లా యశ్వంత్‌పూర్ సమీపంలోని హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై ఓ న్యాయవాది కారును లారీ ఢీకొట్టింది. కారును లారీ వెంబడించి ఢీకొట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రేక్ ఫెయిలైనట్టు లారీ డ్రైవర్ చెబుతున్నారు. ప్రమాదం నుంచి అడ్వకేట్ దుర్గాప్రసాద్ సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనలో హైకోర్టు న్యాయవాది దుర్గాప్రసాద్‌ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఈ ఘటనపై ఆయన అనుమానం వ్యక్తం చేస్తూ జనగామ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన దుర్గాప్రసాద్‌ ఓ భూ వివాదం కేసును వాదించేందుకు వరంగల్‌ కోర్టుకు తన కారులో బయలుదేరారు. జనగామ మండలం యశ్వంత్‌పూర్‌ వద్దకు రాగానే లారీ వెనుక నుంచి వచ్చి కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారును లారీ కొంత దూరం ఈడ్చుకెళ్లింది. అయితే న్యాయవాది మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.

తన ప్రాణాలకు హాని కలిగించేందుకు దుండగులు ఈ దాడికి పాల్పడినట్లు దుర్గాప్రసాద్‌ ఆరోపించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనే అలాగే పేర్కొన్నారు. ఘటన అనంతరం స్థానికులు లారీ డ్రైవర్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. లారీ బ్రేకులు విఫలం కావడంతోనే ప్రమాదం జరిగినట్లు లారీ డ్రైవర్‌ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.

ఇది కూడా చదవండి

AP Ex Minister: ఈ ఫోటోలోని రాజకీయ నాయకుడిని గుర్తుపట్టారా.! ఎక్కడో చూసినట్లు ఉందా.?