పది నెలల క్రితమే ప్లాన్.. కానీ చాలా సార్లు మిస్.. న్యాయవాది వామన్‌రావు హత్య కేసులో కీలక విషయాలు వెల్లడి..

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు హత్య కేసు విచారణను పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి..

  • Sanjay Kasula
  • Publish Date - 8:15 pm, Mon, 22 February 21
పది నెలల క్రితమే ప్లాన్.. కానీ చాలా సార్లు మిస్.. న్యాయవాది వామన్‌రావు హత్య కేసులో కీలక విషయాలు వెల్లడి..
vaman rao advocate

Lawyer Couple Murder Case: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు హత్య కేసు విచారణను పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ ఘటనలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎవరి ప్రమేయం ఉన్న, ఎవరినైనా, ఎంతటివారినైనా వదలిపెట్టేదిలేదని రామగుండం సీపీ సత్యనారాయణ వెల్లడించారు.

హత్య కుట్రలో నిందితులకు కారు, రెండు కత్తులను అందజేసిన బిట్టు శ్రీను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. వామన్‌రావును హత్య చేయాలని పది నెలల క్రితమే ప్లాన్‌ చేశారని తెలిపారు. చాలా సార్లు స్కెచ్‌ విఫలమైందని తెలిపారు. ఈ మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ సోమవారం ప్రకటన విడుదల చేసింది. దీనిలో పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రధాన నిందితుల వాంగ్మూలం, నిందితుడు బిట్టు శ్రీను అలియాస్ తులసిగరి శ్రీను ఇచ్చిన వాంగ్మూలంను విశ్లేషించగా పలు విషయాలు తెలిసాయని అన్నారు.

అయితే.. ఈ దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని… అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరుగుతూ ఆధారాలను శాస్త్రీయంగా విశ్లేషించాల్సి న అవసరం ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా కొంతమంది సాక్ష్యులను కూడా విచారించి వారి వాంగ్మూలం నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉందని అన్నారు.

నిందితులను అందరిని పోలీస్ కస్టడీకి తీసుకొని పూర్తిస్థాయి విచారణ జరిపి వారు ఇచ్చిన వాంగ్మూలంలోని అంశాలను పూర్తి స్థాయిలో నిర్ధారించాల్సి ఉంది. దీనికిగాను హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు మరియు సైబర్ క్రైమ్ పరిశోధకులను విచారణ సహాయకులుగా తీసుకొని ముందుకు సాగడం జరుగుతుంది. అడిషనల్ డిసిపి అడ్మిన్ అశోక్ కుమార్ గారు ప్రధాన విచారణ అధికారిగా సమగ్ర విచారణ చేస్తున్నారు. సాక్ష్యాలు గానీ,హత్యకు సంబంధించిన వీడియో లు సమాచారం,ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నవారు ముందుకు వచ్చి సమాచారం అందిస్తే, ఇచ్చిన ప్రతి అంశాన్ని దర్యాప్తులో నిర్ధారించుకొని పరిశోధనలో ముందుకు పోవడం జరుగుతుంది అంటూ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి :

Regional Ring Road: రంజుగా మారుతున్న రింగు రోడ్డు రాజకీయం.. పోటాపోటీగా వ్యూహాలు..ఎమ్మెల్సీ ఎన్ని‘కలలు’