Crime in Kurnool: కర్నూలు నగరంలో దారుణం.. మొదట భర్తపై.. ఆ తరువాత భార్యపైనా..
Kurnool District: కర్నూలు జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు.
Kurnool District: కర్నూలు జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. అడ్డుకోబోయిన అతని భార్యపైనా కత్తితో విరుచుకుపడ్డాడు. ఈ ఘటన కర్నూలు టౌన్‌లోని సరిన్ నగర్‌లో సోమవారం నాడు చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటేశ్వర్లు, అతని భార్య కర్నూలు పట్టణంలోని సరిన్ నగర్‌లో నివాసం ఉంటున్నారు. అయితే ఇవాళ రాజు అనే వ్యక్తి వెంకటేశ్వర్లు ఇంటికి వచ్చి అతనిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. శరీరం అంతా కత్తిపోట్లు దించాడు. దాంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా, వెంకటేశ్వర్లుపై దాడిని అడ్డుకోబోయిన అతని భార్యపైనా రాజు కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనలో వెంకటేశ్వర్లు భార్యకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంకటేశ్వర్లు మృతి చెందాడని నిర్ధారించుకున్న రాజు అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వెంకటేశ్వర్లు భార్యను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఇక వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు. వెంకటేశ్వర్లు బామ్మర్ధి అయిన రాజు ఈ హత్య చేశాడని పోలీసులకు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజు కోసం గాలిస్తున్నారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియరాలేదు.
Also read:
వాహనదారులకు పెద్ద ఊరట.. పెట్రోల్ ధరలను భారీగా తగ్గించిన రాష్ట్రాలు..
విశ్వసానికి మారు పేరు కుక్క.. అన్నం పెట్టిన యజమానికోసం ఈ శునకం ఏం చేసిందో మీరే చూడండి..