AP Crime News: అనంతపురంలో కన్నింగ్ లేడీ కహానీ.. లక్షకు పది వేల వడ్డీ ఇస్తానంటూ..
Anantapur News: ఆంధ్రప్రదేశ్‌లోనూ కిలాడి లేడీ శిల్పా చౌదరి తరహా మోసం బయటపడింది. అధిక వడ్డీలు ఆశచూపి శిల్ప కోట్లు కొల్లగొట్టినట్టే...
Anantapur News: ఆంధ్రప్రదేశ్‌లోనూ కిలాడి లేడీ శిల్పా చౌదరి తరహా మోసం బయటపడింది. అధిక వడ్డీలు ఆశచూపి శిల్ప కోట్లు కొల్లగొట్టినట్టే… అనంతపురంలో ఓ కన్నింగ్ లేడీ జనాన్ని నిండా ముంచేసింది. లక్షకు ఏకంగా పది వేలు వడ్డీ ఇస్తానంటూ ప్రజల నుంచి కోట్లు వసూళ్లు చేసి పరారైపోయింది. ఆమె చేత మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు.
సిగ్మాసిక్స్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో సంస్థను తెరిచిన అనంతపురం ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ పద్మశ్రీ… అధిక వడ్డీల పేరుతో జనానికి వల వేసింది. లక్షకు పదివేలు వడ్డీ ఇస్తానంటూ ఆశ చూపించింది. చెప్పినట్లే మొదట వడ్డీ చెల్లించింది. లక్ష ఇస్తే నెలకు పది వేలు వడ్డీ ఇచ్చేది. జనం తనను పూర్తిగా నమ్మిన తర్వాత తన అసలు ప్లాన్ ఇంప్లిమెంట్ చేసింది. తాను అనుకున్న టార్గెట్ రీచ్ రాగానే రాత్రికి రాత్రే ఊరు నుంచి ఉడాయించింది.
పద్మశ్రీ పరారవడంతో బాధితులంతా ఆందోళనకు దిగారు. తమ ఒంటిపై ఉన్న నగలను కూడా అమ్మి వడ్డీకి ఆశపడి ఆమెకు డబ్బులిస్తే తమను మోసం చేసిందంటూ లబోదిబోమంటున్నారు. పద్మశ్రీని అరెస్టు చేసి, తమ సొమ్మును తిరిగి ఇప్పించాలని కోరుతున్నారు. వైస్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ స్నేహితురాలు షమీమ్ ద్వారా పరిచయమై డబ్బులు ఇచ్చినట్లు బాధిత మహిళలు చెబుతున్నారు. నమ్మి తాను కూడా పద్మశ్రీ చేతిలో మోసపోయినట్లు షమీమ్ చెబుతోంది. పద్మశ్రీ తమ్ముడు మహేష్, అతని సతీమణి ప్రత్యూష కూడా రియల్ ఎస్టేట్ పేరుతో కోట్లు దండుకున్నారని బాధితులు చెబుతున్నారు.
Also Read..
Madhusudhana Chary: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి… ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించిన గవర్నర్
VVS Laxman: ఎన్సీఏ హెడ్‌గా బాధ్యతలు చేపట్టిన వీవీఎస్ లక్ష్మణ్.. కొత్త సవాల్ అంటూ వ్యాఖ్యలు..