AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Postmaster Fraud: జనం సొమ్ముతో జల్సాలు.. రూ.10కోట్లు కాజేసిన పోస్టుమాస్టర్.. మరణానంతరం వెలుగులోకి నిజాలు!

జనం సొమ్ము కాజేసి జల్సాలు చేయడం, గుట్టురట్టువగానే పరారవడం కామనైపోతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఓ పోస్టు మాస్టర్ ఏకంగా పదికోట్లకు పైగా నొక్కేశాడు. రెండు వేల మంది ఖాతాదారుల సొమ్మును కాజేశాడు.

Postmaster Fraud: జనం సొమ్ముతో జల్సాలు.. రూ.10కోట్లు కాజేసిన పోస్టుమాస్టర్.. మరణానంతరం వెలుగులోకి నిజాలు!
Post Office
Balaraju Goud
| Edited By: |

Updated on: Dec 14, 2021 | 11:27 AM

Share

Thotada Postmaster Fraud: జనం సొమ్ము కాజేసి జల్సాలు చేయడం, గుట్టురట్టువగానే పరారవడం కామనైపోతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఓ పోస్టు మాస్టర్ ఏకంగా పదికోట్లకు పైగా నొక్కేశాడు. రెండు వేల మంది ఖాతాదారుల సొమ్మును కాజేశాడు. ఆముదాలవలస మండలం తోటాడ బ్రాంచ్‌లో బయటపడ్డ ఈ మోసం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

శ్రీకాకుళం జిల్లా తోటాడ పోస్టు ఆఫీస్‌లో ఐదు గ్రామాల ప్రజలకు ఖాతాలున్నాయి. గోపీనగర్‌, అక్కివలస, మాసయ్యపేట, కొత్తరోడ్డు, తోటాడ గ్రామస్తులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మంత్లీ డిపాజిట్లు కట్టుకున్నారు. ఇటీవల పోస్టుమాస్టర్ శశిభూషణరావు మరణించడం, అతని కుటుంబం ఊరు నుంచి పరారవడంతో ఈ మోసం బయటపడింది. పోస్టుమాస్టర్ మృతి చెందడంతో పాటు తమ పోస్ట్ ఆఫీస్ బుక్ లో ఉన్న లావాదేవీలు ఆన్‌లైన్‌లో పొందుపరచ కాకపోవడంతో ఖాతాదారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన అధికారులకు బిత్తరపోయే నిజాలు గుర్తించారు.

దీంతో బాధితులు… పోస్టల్‌ అధికారులు, పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు తోటాడ పోస్టు ఆఫీస్‌లో తనిఖీలు నిర్వహించి… పది కోట్ల రూపాయలకు పైగా కాజేసినట్టు తేల్చారు. రాగోలు గ్రామంలోని శశిభూషణరావు ఇంట్లో పోలీసులు సోదాలు చేపట్టారు. మరోవైపు పోస్ట్ మాస్టర్ నిర్వాకంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఎంతో నమ్మకంగా ఉండటంతో నగదును , చెల్లింపులు చేసామనీ, పోస్టుమార్టం నమ్మకంతో మా గొంతులు కోసారని వాపోతున్నారు. పోస్టల్ శాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఖాతాదారులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

ఇదిలావుంటే, ఈ పోస్ట్ ఆఫీస్ లో సుమారు 700 మంది ఖాతాదారులు ఉన్నట్లు వారి నుండి ఎంత మొత్తం ఎంత దారి మళ్లించారో పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తే గాని తెలియదని పోస్టల్ ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే గ్రామంలో పలువురు ఖాతాదారులు పుస్తకాలు డిపాజిట్ చేసిన పత్రాలను చూపడంతో భారీ స్థాయిలో పోస్ట్మాస్టర్ కుంభకోణానికి పాల్పడిన ట్లు గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read Also… PMFBY: రైతులకు గమనిక.. ఫసల్‌ బీమా యోజన వివరాలు వెల్లడించిన కేంద్రం..

Follow Us
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
నాగరికంలో నరరూప రాక్షసులు.. వంశోద్ధారకుడి పిచ్చితో..
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
ఇక ఏపీ రాజధానిగా అమరావతి.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
పీరియడ్స్‌తో షూటింగుల్లో ఇబ్బంది పడ్డారా? శ్రీలీల ఆన్సర్ వైరల్
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
గంటకు 154.7 కిమీల వేగంతో బౌలింగ్.. అసలు సీక్రెట్ ఇదే..!
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
రూ. 339 కే నెలంతా అపరిమిత సేవలు.. రూ.35,000 విలువైన జెమిని ప్రో
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
శాంసన్, గైక్వాడ్ కాదు.. CSK పాలిట విలన్ ఇతనే..!
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
గ్యాస్ స్టవ్‌లో చిన్న మంట వస్తోందా.? చిటికెలో ఇలా సులభంగా..
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
ఎంత ఉతికినా కిచెన్ టవల్స్‌ జిడ్డు వదలట్లేదా.. ఇలా ట్రై చేయండి
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
సినిమాల్లోకి దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. వీడియో
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు
14 మ్యాచ్‌లలో 6సార్లు జీరోకే.. తలనొప్పిలా మారిన కాటేరమ్మకొడుకు