Fake IT Raid: ఐటీ అధికారుల పేరుతో ఓ ఇంట్లోకి ఎంట్రీ.. 3 కేజీల గోల్డ్, రూ.2లక్షల నగదుతో పరార్!
అచ్చం ఐటీ అధికారుల్లాగే షూటుబూటుల్లో ఎంట్రీ ఇచ్చారు. ఐటీ అధికారులం, మీ ఇంట్లో సోదాలు చేయాలంటూ బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత ఇల్లంతా జల్లెడ పట్టారు.
Hyderabad Fake IT Raid: అచ్చం ఐటీ అధికారుల్లాగే షూటుబూటుల్లో ఎంట్రీ ఇచ్చారు. ఐటీ అధికారులం, మీ ఇంట్లో సోదాలు చేయాలంటూ బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత ఇల్లంతా జల్లెడ పట్టారు. మూడు కేజీల బంగారం, రెండు లక్షల నగదు దొరకడంతో వాటిని పట్టుకుని చెక్కేశారు. వచ్చినోళ్లు ఐటీ అధికారులు కాదు… ఫేక్‌గాళ్లు అని గుర్తించేలోపే ఎస్కేప్ అయ్యారు. బాధితురాలు భాగ్యలక్ష్మి ఫిర్యాదుతో ఫేక్ ఐటీ ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం రెండు గంటల టైమ్‌లో ఈ ఇన్సిడెంట్ జరగడంతో సీసీ ఫుటేజ్ సేకరిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరం నానక్ రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జయభేరి ఆరెంజ్ కౌంటీ లో ఉంటున్న భాగ్యలక్ష్మి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని ఆరెంజ్ కౌంటిలోని సి బ్లాక్‌లో భాగ్యలక్ష్మి నివాసముంటున్నారు. భాగ్యలక్ష్మి ఇంటికి ఉదయాన్నే ఐదుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. ఐటీ అధికారులమంటూ వారి ఫోన్లు తీసుకుని విచారిస్తున్నట్లు నటించారు. లాకర్ తాళాలు తీసుకొని అందులోని మూడు కిలోల బంగారం, డబ్బుతో అక్కడి నుంచి పారిపోయారు. తనకు ఎలాంటి వివరాలు చెప్పకపోవడం, తీసుకెళ్తున్న నగదు వివరాలు అందించకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు గచ్చిబౌలి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Read Also… AP Crime News: అనంతపురంలో కన్నింగ్ లేడీ కహానీ.. లక్షకు పది వేల వడ్డీ ఇస్తానంటూ..