విషాదం.. ఆలయ కొలనుకు వెళ్లి ప్రమాదవశాత్తూ ఐదుగురు మృత్యువాత.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు
5 Drowned in Temple Pond: ఆలయ కొలనులో మునిగి ఐదుగురు మరణించారు. దుస్తులు ఉతికేందుకు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలున్నారు. ఈ విషాధ సంఘటన
5 Drowned in Temple Pond: ఆలయ కొలనులో మునిగి ఐదుగురు మరణించారు. దుస్తులు ఉతికేందుకు వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ముగ్గురు బాలికలు, ఇద్దరు మహిళలున్నారు. ఈ విషాధ సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కొత్తగుమ్మిడిపూండిలో బుధవారం జరిగింది. వివరాలు.. ఇటీవల కురిసిన వర్షాలకు కొత్తగుమ్మిడిపూండిలోని అంకాళమ్మన ఆలయంలోని కొలను నిండింది. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన సుమతి (35), ఆమె కుమార్తె అశ్విత (14) దుస్తులు ఉతికేందుకు కొలను వద్దకు వెళ్లారు. అప్పటికే అక్కడ జ్యోతిలక్ష్మి (38), జీవిత (14), నర్మద (10) దుస్తులు ఉతుకుతున్నారు. పని పూర్తయ్యాక అశ్విత, జీవిత, నర్మద కొలనులోనే స్నానం చేస్తూ.. కొలను లోపలి భాగానికి వెళ్లారు. నర్మద కొలను మధ్యలోకి వెళ్లి నీటిలో మునిగిపోతోంది. వెంటనే జీవిత, అశ్విత ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తూ వారూ కూడా మునిగిపోయారు. పిల్లలు మునిగిపోతుండడాన్ని గమనించిన తల్లులు సుమతి, జ్యోతిలక్ష్మి కూడా వారిని రక్షించేందుకు కొలను మధ్య భాగానికి వెళ్లారు. ఈ క్రమంలో వారు కూడా మునిగి అందరూ జలసమాధి అయ్యారు.
గమనించిన చుట్టుపక్కల వారు.. వెంటనే గ్రామస్థులకు తెలియజేశారు. స్థానికులంతా అక్కడకు చేరుకొని కొలనులో గాలించగా.. ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న గుమ్మిడిపూండి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పొన్నేరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా.. గ్రామానికి చెందిన ఐదుగురు కొలను పడి మృతిచెందడంతో.. అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా.. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా మృతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున పరిహారాన్ని కుటుంబాలకు అందించనున్నట్లు ప్రకటించారు.
Also Read: