ఢిల్లీ కోర్టులో హత్య ఘటన.. లాయర్ సహా నలుగురి అరెస్ట్.. ఆ రాత్రి ఏం జరిగింది ..?

ఢిల్లీలోని ద్వారకా కోర్టులో ఈనెల 12 న జరిగిన ఓ వ్యక్తి హత్య కేసుకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఓ లాయర్ కూడా ఉన్నాడు. ఈ న్యాయవాదికి చెందిన 444 ఛాంబర్ లో గత సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో 45 ఏళ్ళ ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు.

ఢిల్లీ కోర్టులో హత్య ఘటన.. లాయర్ సహా నలుగురి అరెస్ట్.. ఆ రాత్రి  ఏం జరిగింది ..?
4 Arrested For Killing A Man In Delhi Court,dwaraka Court,murder,july 12,4 Arrested,lawyer Arun Sharma,victim Swikar Luthra,police
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jul 15, 2021 | 10:26 AM

ఢిల్లీలోని ద్వారకా కోర్టులో ఈనెల 12 న జరిగిన ఓ వ్యక్తి హత్య కేసుకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఓ లాయర్ కూడా ఉన్నాడు. ఈ న్యాయవాదికి చెందిన 444 ఛాంబర్ లో గత సోమవారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో 45 ఏళ్ళ ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతడిని స్వీకార్ లూత్రాగా గుర్తించారు. ఈ కేసులో అరుణ్ శర్మ అనే లాయర్ తో సహా రోహిత్జ్, దర్శన్, ప్రదీప్ అనే వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు చెప్పారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన లూత్రాను ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారని వారు తెలిపారు. ఇతనికి క్రిమినల్ చరిత్ర ఉందన్నారు. లాయర్ అరుణ్ శర్మకు క్లయింట్ అయిన లూథ్రా బెయిలుపై ఉన్నాడని. ఆ రోజున తన సహచరుడైన ప్రదీప్ తో కలిసి ఆటో డ్రైవర్ దర్శన్ తో బాటు అరుణ్ శర్మ చాంబర్ కు వచ్చాడని ఖాకీలు వెల్లడించారు. అదే నసమయంలో శర్మ తన కారు డ్రైవర్ రోహిత్ ని కూడా అక్కడికి పిలిపించాడన్నారు. ఈ చాంబర్ లోనే అంతా కలిసి మద్యం తాగినట్టు తెలిసిందన్నారు.

కాగా ఎవరో వ్యక్తులు వచ్చి లూథ్రాపై కాల్పులు జరిపి పరారైనట్టు వీరు పోలీసులకు కల్లబొల్లి కబుర్లు చెప్పినట్టు తెలిసింది. కానీ ఈ చాంబర్ బయట రక్తపు మరకలను కొందరు శుభ్ర పరచడం, లూథ్రా శరీరాన్ని బయటకు ఈడ్చుకు రావడం సీసీటీవీ ఫుటేజిలో కనిపించిందని పోలీసులు వెల్లడించారు. 2016 లో ఫేక్ కాయిన్ రాకెట్ లో లూథ్రా అరెస్టయ్యాడని, ఆ తరువాత బెయిల్ పై విడుదలయ్యాడని వారు చెప్పారు. బహుశా డబ్బుల కోసమే ఈ హత్య జరిగినట్టు భావిస్తున్నామని,, ఇంకా దర్యాప్తు జరుపుతున్నామని వారన్నారు. అయినా లాయర్ ఛాంబర్ లోనే వీరు మద్యం తాగడం, హత్య చేయడం చూస్తే కోర్టులు కూడా నేరాలకు నిలయాలుగా మారుతున్నాయా అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : స్కూల్ కు వెళ్లిన చిరుతపులి..అధికారులకు 4 గంటల రెస్క్యూ.. వైరల్ అవుతున్న వీడియో..:Leopard In School Video.

 Sonu Sood Video: సోనూసూద్‌ ను కొట్టారు అందుకే టీవీ ప‌గ‌ల‌గొట్టిన అంటున్న బుడ్డోడు.రీజన్ మాములుగా లేదు.

 Nivetha Pethuraj Video: ఎఫ్1 రేసర్‌గా నివేతా పేతురాజ్‌..ఫార్ములా రేస్ కార్‌లో లెవెల్‌లో 1 సర్టిఫికెట్..(వీడియో).

 గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌..అందుబాటులోకి కొత్త సర్వీసులు..!Good News For LPG Customer video.

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో