ఇక్కడ మార్చి 31 అయితే.. అక్కడ మాత్రం ఏప్రిల్ 1 వరకు లాక్‌డౌన్
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే దీని బారినపడి పదిహేను వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మూడున్నర లక్షల మంది ఆస్పత్రిపాలయయారు. ఈ నేపథ్యంలో అనేక చోట్ల ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. తాజాగా మనదేశంలో అనేక చోట్ల ఈ మార్చి 31 వరకు లాక్‌డౌన్ విధించాయి. అయితే మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఏప్రిల్ 1 వరకు లాక్‌డౌన్ విధించింది అక్కడి యడియూరప్ప సర్కార్.ఈ నేపథ్యంలో సీఎం ఉత్తర్వులు కూడా జారీ […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే దీని బారినపడి పదిహేను వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. మూడున్నర లక్షల మంది ఆస్పత్రిపాలయయారు. ఈ నేపథ్యంలో అనేక చోట్ల ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. తాజాగా మనదేశంలో అనేక చోట్ల ఈ మార్చి 31 వరకు లాక్‌డౌన్ విధించాయి. అయితే మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ఏప్రిల్ 1 వరకు లాక్‌డౌన్ విధించింది అక్కడి యడియూరప్ప సర్కార్.ఈ నేపథ్యంలో సీఎం ఉత్తర్వులు కూడా జారీ చేశారు.
సోమవారం రాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోంటోంది అక్కడి ప్రభుత్వం. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలంతా లాక్‌డౌన్‌ను పాటించి సహకరించాలంటూ సీఎం యడియూరప్ప కోరారు. కాగా.. అంతకుముందే.. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు రవాణాతో పాటు.. ఉబర్, ఒలా, ట్యాక్సీలు, ఆటోలు తిరగరాదంటూ ఆంక్షలు విధించారు. ప్రస్తుతం కర్ణాటకలో 33 పాజిటివ్ కేసులు నమొదయ్యాయి.