శ్రీమంతుడే.. ఇటు రాష్ట్రాలకు.. అటు కేంద్రానికి.. ఒకే తీరుగా..

దేశాన్ని కరోనా మహమ్మారి కబలిస్తున్న వేళ.. జనసేనాని తనవంతు సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనవంతు సాయంగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు, కేంద్రానికి భారీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ […]

  • Updated On - 10:39 am, Thu, 26 March 20 Edited By:
శ్రీమంతుడే.. ఇటు రాష్ట్రాలకు.. అటు కేంద్రానికి.. ఒకే తీరుగా..

దేశాన్ని కరోనా మహమ్మారి కబలిస్తున్న వేళ.. జనసేనాని తనవంతు సాయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో తనవంతు సాయంగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఉభయ తెలుగు రాష్ట్రాలకు, కేంద్రానికి భారీ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.50 లక్షల చొప్పున కోటి రూపాయల విరాళం అందించనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. ప్రధాన మంత్రి సహాయ నిధికి కూడా రూ.1 కోటి రూపాయల విరాళం అందించనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రధాని మోదీ తీసుకుంటున్న ఈ నిర్ణయాలతో..దేశం నుంచి కరోనా మహమ్మారి పారిపోతుందన్న ఆశాభావాన్ని పవన్ కల్యాణ్ వ్యక్తం చేశారు.