Lock Down In India: కరోనా విజృంభణకు అడ్డుకట్ట వేయాలంటే లాక్‌డౌన్ పెట్టాల్సిందే.. కేంద్రాన్ని కోరిన మెడికల్ అసోసియేషన్..
Lock Down In India: భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గతేడాదిని మించి కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. గతేడాది...
Lock Down In India: భారత్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గతేడాదిని మించి కేసులు నమోదవుతున్నాయి. ఇక మరణాల సంఖ్య కూడా ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. గతేడాది ఇప్పటి కంటే తక్కువ కేసులు నమోదవుతేనే దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించారు. కానీ ఈసారి మాత్రం కేంద్రం లాక్‌డౌన్ దిశగా అడుగులు వేయడం లేదు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే పలు విదేశీ సంస్థలు భారత్‌లో కరోనా అదుపులోకి రావాలంటే కచ్చితంగా లాక్‌డౌన్‌ను విధించాల్సిందేనని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ కూడా ఈ విషయాన్ని మరోసారి నొక్కి చెప్పింది. కరోనా కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పెట్టాలని కేంద్రాన్ని కోరింది. వైరస్ చైన్‌కు అడ్డుకట్ట వేయడంతో పాటు కోవిడ్ రోగులకు సేవలు అందిస్తున్న మెడికల్ సిబ్బందికి కొంతమేర స్వస్థత చేకూరుతుందని అభిప్రాయపడింది. ఇక గతంలోనే తమ అసోసియేషన్ నుంచి కేంద్రానికి ఇచ్చిన సలహాలు, సూచనలు పలుమార్లు బుట్టదాఖలు అయ్యాయని మెడికల్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తంచేసింది. దేశ వ్యాప్తంగా పూర్తి లాక్‌డౌన్ అవసరమని కేంద్రాన్ని కోరారు. రాత్రిపూట కర్ఫ్యూల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని, దేశ ఆర్థిక వ్యవస్థ కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని మెడికల్ అసోసియేషన్ అభిప్రాయపడింది. ఇక వ్యాక్సిన్‌నేషన్ ప్రణాళికనూ కూడా తప్పుబట్టింది. ప్రజా వైద్యానికి దేశ జీడీపీలో 8 శాతం మేర కేటాయింపులు జరపాలని కేంద్రానికి రాసిన లేఖలో ప్రస్తావించారు. మరి మెడికల్ అసోషియేషన్ ప్రతిపాదనపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Also Read: మధ్యప్రదేశ్ లో జనతా కర్ఫ్యూను ఉల్లంఘించి యువకుల వీరంగం, చేతుల్లో గన్స్ తో వీధుల్లో కాల్పులు