మధ్యప్రదేశ్ లో జనతా కర్ఫ్యూను ఉల్లంఘించి యువకుల వీరంగం, చేతుల్లో గన్స్ తో వీధుల్లో కాల్పులు
మధ్యప్రదేశ్ లోని మోరేనా జిల్లాలో శనివారం కొందరు జనతా కర్ఫ్యూను ఉల్లంఘించి చేతుల్లో గన్స్ తో బైకులపై తిరుగుతూ భయోత్పాతాన్ని సృష్టించారు.
మధ్యప్రదేశ్ లోని మోరేనా జిల్లాలో శనివారం కొందరు జనతా కర్ఫ్యూను ఉల్లంఘించి చేతుల్లో గన్స్ తో బైకులపై తిరుగుతూ భయోత్పాతాన్ని సృష్టించారు. అక్కడక్కడ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళ తలపై గాయమైంది. ముఖాలకు రుమాళ్ళు ]చుట్టుకుని ఈ యువకులు చేసిన వీరంగంతో స్థానికులు వణికిపోయారు. వీరి కాల్పుల్లో తన భార్య గాయపడిందని ,అసలే ఆమె ఆరోగ్యం బాగు లేదని ఆమె భర్త వాపోయాడు. నిన్న ఓ వర్గం సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుతో ప్రతీకారంగా వీరంతా ఇలా పేట్రేగిపోయినట్టు భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. శుక్రవారం కూడా ఆ వర్గం వారు ఇలాగే వీధుల్లో భయోత్పాతం సృష్టించారని, అందుకు పగ పెంచుకున్న మరో వర్గం ఈ హింసకు పాల్పడిందని వారు చెప్పారు. వీరిలో కొందరిని అరెస్టు చేసినట్టు వారు తెలిపారు. ఎవరినీ వదలబోమన్నారు. కాగా మధ్యప్రదేశ్ లో కోవిద్ కేసులు పెరిగిపోయిన దృష్ట్యా ఈ నెల 15 వరకు సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ప్రభుత్వం జనగతా కర్ఫ్యూను విధించింది.కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: రెండో ఎక్కం చెప్పలేని వరుడు, ఈ పెళ్లి వద్దని చక్కా పోయిన వధువు, ఈ వింత ఎక్కడంటే ?