Bird Flu: మ‌రోసారి బ‌ర్డ్ ఫ్లూ క‌ల‌క‌లం.. లుధియాన‌ పౌల్ట్రీఫామ్‌లోని కోళ్ల‌కు పాజిటివ్‌గా నిర్ధార‌ణ‌..

Bird Flu: ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ దేశాన్ని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో దేశాన్ని అల్ల‌క‌ల్లోలానికి గురి చేస్తోంది. అయితే ఇదే స‌మ‌యంలో వ‌చ్చిన ఓ వార్త అంద‌రినీ అంద‌రినీ...

Bird Flu: మ‌రోసారి బ‌ర్డ్ ఫ్లూ క‌ల‌క‌లం.. లుధియాన‌ పౌల్ట్రీఫామ్‌లోని కోళ్ల‌కు పాజిటివ్‌గా నిర్ధార‌ణ‌..
Bird Flu
Follow us

|

Updated on: May 09, 2021 | 5:54 AM

Bird Flu: ఓవైపు క‌రోనా మ‌హ‌మ్మారి యావ‌త్ దేశాన్ని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తోంది. సెకండ్ వేవ్ రూపంలో దేశాన్ని అల్ల‌క‌ల్లోలానికి గురి చేస్తోంది. అయితే ఇదే స‌మ‌యంలో వ‌చ్చిన ఓ వార్త అంద‌రినీ అంద‌రినీ గంద‌ర‌గోళానికి గురిచేస్తోంది. ఈ ఏడాది మొద‌ట్లో దేశ వ్యాప్తంగా బ‌ర్డ్ ఫ్లూ వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపిన విష‌యం విధిత‌మే. అయితే తాజాగా మ‌రోసారి బ‌ర్డ్‌ఫ్లూ పాజిటివ్ కేసు గుర్తించడంతో ఆందోళ‌న నెల‌కొంది. పంజాబ్ రాష్ట్రంలోని లుధియాన‌లోని ఓ పౌల్ట్రీఫామ్‌లోని కోళ్ల నుంచి సేక‌రించిన శాంపిల్స్‌లో బ‌ర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా గుర్తించారు. భోపాల్‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్కూరిటీ యానిమ‌ల్ డిజిసెస్ అధికారులు శుక్ర‌వారం రాయ్‌పూర్‌లోని ఓ పౌల్ట్రీ ఫామ్‌లో బ‌ర్డ్‌ఫ్లూ కేసుల‌ను గుర్తించారు. పంజాబ్ ప్ర‌భుత్వం ఆ పౌల్ట్రీ ఫామ్‌ను బ‌ర్డ్‌ప్లూ సోకిన ప్రాంతంగా ప్ర‌క‌టించార‌ని డిప్యూటీ క‌మిష‌న‌ర్ వారింద‌ర్ శ‌ర్మ తెలిపారు. ఇక బ‌ర్డ్‌ఫ్లూ సోకిన కోళ్ల‌ను అధికారులు వ‌ధించారు. ఇందుకోసం అధికారులు ఓ క‌మిటీని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది మొద‌ట్లో దేశ వ్యాప్తంగా బ‌ర్డ్ ఫ్లూ సృష్టించిన క‌ల‌క‌లం ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. దేశ‌వ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ల‌క్ష‌ల సంఖ్య‌లో ప‌క్షులు మృత్యువాత‌ప‌డ్డాయి. అయితే అనంత‌రం బ‌ర్డ్‌ప్లూ కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చాయి. కానీ తాజాగా మ‌రోసారి పంజాబ్‌లో బ‌ర్డ్‌ఫ్లూ కేసు బ‌య‌టప‌డ‌డంతో అంద‌రిలో ఆందోళ‌న నెల‌కొంది.

Also Read: రెండో ఎక్కం చెప్పలేని వరుడు, ఈ పెళ్లి వద్దని చక్కా పోయిన వధువు, ఈ వింత ఎక్కడంటే ?

Viral: తల్లి, భార్య నగలను తాకట్టు పెట్టి.. కోవిడ్‌ ఆసుపత్రిని నిర్మించాడు.. ప్రశంసలు అందుకుంటున్నాడు.!

Medical Oxygen: మెడికల్ ఆక్సిజన్.. ట్యాంకర్లకు టోల్ మినహాయింపు.. కేంద్రం కీలక ఉత్తర్వులు..