AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: తల్లి, భార్య నగలను తాకట్టు పెట్టి.. కోవిడ్‌ ఆసుపత్రిని నిర్మించాడు.. ప్రశంసలు అందుకుంటున్నాడు.!

కరోనా మహమ్మారి మహారాష్ట్రలో భీభత్సం సృష్టిస్తోంది. దేశంలోనే అత్యధిక మరణాలు, కేసులు ఇక్కడ్నుంచే వస్తున్నాయి...

Viral: తల్లి, భార్య నగలను తాకట్టు పెట్టి.. కోవిడ్‌ ఆసుపత్రిని నిర్మించాడు.. ప్రశంసలు అందుకుంటున్నాడు.!
Ravi Kiran
|

Updated on: May 08, 2021 | 9:47 PM

Share

Covid Hospital News: కరోనా మహమ్మారి మహారాష్ట్రలో భీభత్సం సృష్టిస్తోంది. దేశంలోనే అత్యధిక మరణాలు, కేసులు ఇక్కడ్నుంచే వస్తున్నాయి. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌,పడకల్లేక అనేకమంది ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు రోగులు, వారి కుటుంబ సభ్యులు పడుతున్న అవస్థలను చూసి చలించిపోయాడో వ్యక్తి. ఈ సంక్షోభ సమయంలో తనవంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఏకంగా ఓ కొవిడ్ ఆస్పత్రినే నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తగినంత డబ్బులేకపోవడంతో తన తల్లి, భార్య నగలను తాకట్టు పెట్టి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు పుణెకు చెందిన ఉమేశ్‌ చవాన్‌..

పుణెలోని పేటెంట్‌ రైట్స్‌ కౌన్సిల్‌ సంస్థకు అధినేతగా ఉన్నాడు ఉమేశ్‌ చవాన్‌. ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పేరుతో 53 పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. తన తల్లి, భార్య వద్ద ఉన్న 35 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 30లక్షలు తీసుకున్నారు. అతడు తలపెట్టిన గొప్ప కార్యాన్ని ప్రశంసిస్తూ స్నేహితులు సాయం చేయడానికి ముందుకొచ్చారు. తన సంస్థలోని సహచర వర్కర్ల సాయంతో శ్రమించి ఏడు రోజుల్లోనే ఆస్పత్రి నిర్మించాడు.

ఛత్రపతి శివాజీ కొవిడ్‌ ఆస్పత్రిలో 33 ఆక్సిజన్‌ పడకలతో పాటు 20 సాధారణ పడకలున్నాయి. ఉమేశ్‌ చవాన్‌ పేటెంట్‌ రైట్స్‌ కౌన్సిల్‌ సంస్థ ద్వారా గత కొన్నేళ్లుగా ఇతర ఆస్పత్రుల్లో రోగులకు తక్కువ ధరల్లోనే నాణ్యమైన వసతులు అందేలా కృషి చేసారు. ప్రస్తుతం కొత్తగా నిర్మించిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ కొవిడ్‌ ఆస్పత్రిలో కూడా రోగుల అవసరాలను తీర్చేలా అన్ని వసతులు ఏర్పాటు చేసారు.

ఇవీ చదవండి:

Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!