రెండో ఎక్కం చెప్పలేని వరుడు, ఈ పెళ్లి వద్దని చక్కా పోయిన వధువు, ఈ వింత ఎక్కడంటే ?

పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని అంటారు. కానీ ఈ భూమ్మీద జరిగే కొన్ని పెళ్లిళ్లు మాత్రం విచిత్రంగా ఉంటాయి. యూపీ లోని మెహబూబా జిల్లాలో ధావార్ అనే గ్రామం ఒకటుంది.

  • Publish Date - 10:26 pm, Sat, 8 May 21 Edited By: Phani CH
రెండో ఎక్కం చెప్పలేని వరుడు, ఈ పెళ్లి వద్దని చక్కా పోయిన వధువు, ఈ వింత ఎక్కడంటే ?
Bride Calls Off Wedding Up

పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయని అంటారు. కానీ ఈ భూమ్మీద జరిగే కొన్ని పెళ్లిళ్లు మాత్రం విచిత్రంగా ఉంటాయి. యూపీ లోని మెహబూబా జిల్లాలో ధావార్ అనే గ్రామం ఒకటుంది. ఈ గ్రామానికే వెళ్తే అక్కడ ఈ మధ్య జరిగిన ఓ వివాహ తంతు (?) తెలిసి ఆశ్చర్యంగా ముక్కున వేలేసుకోవలసిందే. చివర వరకు వచ్చి చటుక్కున ఆ పెళ్లి ఆగిపోయింది మరి.. కారణం పెళ్లికూతురే !తన పెళ్లి గురించి ఆనందంతో వరుడు తన స్నేహితులు, బంధువులతో ఆర్భాటంగా బారాత్ తో పెళ్లి జరిగే వెడ్డింగ్ హాలు వద్దకు చేరుకున్నాడు. ఇక పెళ్లి హాలు అంటే మాటలా ? అంతా కోలాహలంగా, సందడిగా ఉంది. వధూవరులు పూలమాలలు మార్చుకునే టైం కూడా వచ్చేసింది. కానీ ఎందుకో వధువుకు వరుడి విద్యార్హతలపై అనుమానం వచ్చింది. జస్ట్ సింపుల్ ప్రశ్న అడుగుతా.. రెండో ఎక్కం చెప్పమని అడిగింది. దానికి అతగాడు చెప్పలేక నీళ్లు నమిలాడు. తత్తరపడ్డాడు. ఇక పెళ్లికూతురు డౌట్ క్లియర్ అయిపొయింది. అతడు ఏమీ చదువుకోలేదని తెలుసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హాల్లో ఉన్నవారంతా ఇది చూసి ఆశ్చర్యపోయారు. ఈ పెళ్లి నాకొద్దు బాబూ అని ఆ వధువు తన ఫ్రెండ్స్ వద్ద తెగేసి చెప్పిందట.. కనీసం రెండో ఎక్కం కూడా చెప్పలేని ఈ పెళ్లికొడుకును తాను వివాహం చేసుకోలేనని ఆమె చెప్పింది. చివరకు రెండు కుటుంబాలూ రాజీకి రావడంతో మొత్తానికి ఈ పెళ్లి రద్దు వ్యవహారం పోలీసులవరకు వెళ్ళలేదు.
మరి ఆ వరుడు నీ చదువెంత అని ప్రశ్నించలేక పోయాడని కొందరు సణుక్కున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral: తల్లి, భార్య నగలను తాకట్టు పెట్టి.. కోవిడ్‌ ఆసుపత్రిని నిర్మించాడు.. ప్రశంసలు అందుకుంటున్నాడు.!

Medical Oxygen: మెడికల్ ఆక్సిజన్.. ట్యాంకర్లకు టోల్ మినహాయింపు.. కేంద్రం కీలక ఉత్తర్వులు..