Medical Oxygen: మెడికల్ ఆక్సిజన్.. ట్యాంకర్లకు టోల్ మినహాయింపు.. కేంద్రం కీలక ఉత్తర్వులు..
NHAI exempts tankers carrying oxygen: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు, నాలుగు వేలకు పైగా మరణాలు
NHAI exempts tankers carrying oxygen: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు, నాలుగు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశం అంతటా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ రవాణా చేసే ట్యాంకర్లు, కంటైనర్లు వంటి వాహనాలకు టోల్ టాక్స్‌ను మినహాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ రహదారులలోని టోల్ ప్లాజాల వద్ద ఈ వాహనాలు నిరంతరాయంగా నడిచేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటినుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను తీసుకెళ్లే కంటైనర్లు, ట్యాంకర్లు, అంబులెన్స్‌లు వంటి ఇతర అత్యవసర వాహనాలతో సమానంగా పరిగణించనున్నారు. ఆక్సిజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు నెలలు లేదా తదుపరి ఆదేశాల వరకు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్‌కు ఎప్పుడూ లేనివధంగా కొరత ఏర్పడింది. కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఆక్సిజన్ అందక చాలామంది మరణిస్తున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా 9 లక్షల మంది కోవిడ్ రోగులకు వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్టు అవసరం అవుతోందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రవాణాను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: