Viral: రియల్ కోవిడ్ హీరో ఈ పోలీస్.. కూతురి పెళ్లి వాయిదా వేసి.. 1100 మృతదేహాలకు అంత్యక్రియలు చేశాడు..
Delhi Police Real Hero: కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తోంది. ఈ క్రమంలో వైరస్ తో మరణించినవారి అంత్యక్రియలు ప్రశ్నార్థకంగా...
Delhi Police Real Hero: కరోనా సెకండ్ వేవ్ విలయం సృష్టిస్తోంది. ఈ క్రమంలో వైరస్ తో మరణించినవారి అంత్యక్రియలు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. వైరస్ భయంతో కుటుంబసభ్యులు ముందుకురాక అనాథ శవాల్లా మారుతున్న పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. ఢిల్లీ అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రాకేష్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. 56 సంవత్సరాల రాకేష్ కుమార్ కొన్ని రోజులుగా ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో 1100 శవాలకు దహన సంస్కరాలు నిర్వహించడంలో సాయపడ్డారు.
ఏప్రిల్ 13 నుండి ఇప్పటివరకు కుమార్ 50 కి పైగా మృతదేహాలకు స్వయంగా అంతిమసంస్కారాలు చేసారు. రాకేష్ కుమార్ హజ్రత్ నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. మహమ్మారి నేపథ్యంలో మే 7 న జరగాల్సిన తన కుమార్తె వివాహాన్ని కూడా వాయిదా వేశారు. ఈ కష్టకాలంలో ప్రజలకు సాయంగా ఉండాలని, అందుకే తాను… ఉద్యోగాన్ని వదులుకోవడానికి ఇష్టపడనని చెప్పుకొచ్చారు. రాకేష్ సేవల గురించి ఢిల్లీ పోలీస్ తమ అధికారిక ట్విటర్ అకౌంట్లో ప్రస్తావించింది.
“ఢిల్లీ పోలీస్ ఎఎస్‌ఐ రాకేశ్ (56), ముగ్గురు పిల్లలతో పిఎస్ నిజాముద్దీన్ బ్యారక్లో నివసిస్తున్నారు. ఏప్రిల్ 13 నుండి లోధి రోడ్ శ్మశానవాటికలో విధుల్లో ఉన్నారు. తన విధుల్లో భాగంగా 1100 మందికి పైగా చివరి…కర్మలకు సహాయం చేసారు స్వయంగా 50కి పైగా మృతదేహాలకు తలకొరివి పెట్టారు. దీనికోసం మే 7న జరగాల్సిన కూతురు వివాహాన్ని సైతం వాయిదా వేసుకున్నారు’ అని ట్విట్ చేశారు.
ఇవీ చదవండి:
Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!
Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!
Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!
COVID time has thrown up some real heroes. ASI Rakesh deserves highest degree of praise and encouragement. Infact it is men like him who keep the society going. Something that many need to learn @LtGovDelhi @HMOIndia @PMOIndia https://t.co/rx8RYIL6Zd
— CP Delhi #DilKiPolice (@CPDelhi) May 6, 2021