AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Oxygen: మెడికల్ ఆక్సిజన్.. ట్యాంకర్లకు టోల్ మినహాయింపు.. కేంద్రం కీలక ఉత్తర్వులు..

NHAI exempts tankers carrying oxygen: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు, నాలుగు వేలకు పైగా మరణాలు

Medical Oxygen: మెడికల్ ఆక్సిజన్.. ట్యాంకర్లకు టోల్ మినహాయింపు.. కేంద్రం కీలక ఉత్తర్వులు..
Medical Oxygen
Shaik Madar Saheb
|

Updated on: May 08, 2021 | 9:43 PM

Share

NHAI exempts tankers carrying oxygen: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. నిత్యం నాలుగు లక్షలకు పైగా కేసులు, నాలుగు వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశం అంతటా విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆక్సిజన్ లేక వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర రోడ్డు ర‌వాణా, జాతీయ ర‌హ‌దారుల మంత్రిత్వ శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆక్సిజ‌న్ ర‌వాణా చేసే ట్యాంక‌ర్లు, కంటైన‌ర్లు వంటి వాహ‌నాల‌కు టోల్ టాక్స్‌ను మిన‌హాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ ర‌హ‌దారుల‌లోని టోల్ ప్లాజాల వ‌ద్ద ఈ వాహ‌నాలు నిరంత‌రాయంగా నడిచేందుకు వీలుగా ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఇప్పటినుంచి లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌ను తీసుకెళ్లే కంటైనర్లు, ట్యాంక‌ర్లు, అంబులెన్స్‌లు వంటి ఇతర అత్యవసర వాహనాలతో సమానంగా ప‌రిగ‌ణించనున్నారు. ఆక్సిజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు నెలలు లేదా తదుపరి ఆదేశాల వరకు ఈ ఉత్తర్వులు అమ‌లులో ఉంటాయని కేంద్ర‌ రోడ్డు రవాణా, జాతీయ‌ రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్ఏఐ) శ‌నివారం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

క‌రోనా నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్‌‌కు ఎప్పుడూ లేనివధంగా కొరత ఏర్పడింది. కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఆక్సిజన్ అందక చాలామంది మరణిస్తున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా 9 లక్షల మంది కోవిడ్ రోగులకు వెంటిలేటర్, ఆక్సిజన్ సపోర్టు అవసరం అవుతోందని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రవాణాను కూడా వేగవంతం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read:

Covid-19: కరోనా తర్వాత కోలుకునేందుకు.. ఈ ఆహార నియమాన్ని పాటించండి.. ప్రభుత్వం సూచనలు..

Corona: వేడి నీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చా..? ఇది నిజమేనా..? ప్రభుత్వం ఏమంటుందో తెలిస్తే షాకవుతారు..

ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త.. వేతనాలు ఇక ముందుగానే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
షర్ట్ కాలర్ దగ్గర ఈ చిన్న బటన్ ఎంత పెద్ద పనిచేస్తుందో తెలిస్తే..
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
టీమిండియా ఓటమికి స్కెచ్ వేసిన గంభీర్, గిల్ జోడీ..?
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
బిగ్ బాస్ సీజన్ 9 విజేతగా లేడీ టైగర్..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల..
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
ఉదయ్ కిరణ్‏తో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ?
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
పైసా పెట్టుబడి లేకుండా ఈ పని స్టార్ట్‌ చేయండి! నెలకు రూ.30 వేలు..
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
ఫాస్ట్‌గా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఈ డైట్ ప్లాన్ మీ కోసమే
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
టీమిండియా పాలిట విలన్‌ను మైదానం నుంచి గెంటేసిన కోహ్లీ
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..
హైదరాబాద్ ప్రజలకు ఊరట.. అక్కడ మరో పెద్ద రోడ్డుకు గ్రీన్ సిగ్నల్..