AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

COVID Drug: కోవిడ్ బాధితులకు గుడ్‌న్యూస్.. మరో వారంలో మీ సమీపంలోని మెడికల్ షాపుల్లోకి టాబ్లెట్స్..

"మొలనుపిరవిర్.." ఇది కోవిడ్‌కు మందు..  ఈ వారం నుంచి మెడికల్ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది. తాజాగా డ్రగ్ కంట్రోలర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఔషధాన్ని తయారు చేసి విక్రయించేందుకు దేశంలోని..

COVID Drug: కోవిడ్ బాధితులకు గుడ్‌న్యూస్.. మరో వారంలో మీ సమీపంలోని మెడికల్ షాపుల్లోకి టాబ్లెట్స్..
Molnupiravir
Sanjay Kasula
| Edited By: Anil kumar poka|

Updated on: Jan 06, 2022 | 3:49 PM

Share

What is The COVID-19 Pill: “మొలనుపిరవిర్..” ఇది కోవిడ్‌కు మందు..  ఈ వారం నుంచి మెడికల్ స్టోర్స్‌లో అందుబాటులోకి రానుంది. తాజాగా డ్రగ్ కంట్రోలర్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ఔషధాన్ని తయారు చేసి విక్రయించేందుకు దేశంలోని ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చింది. వీటిలో డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, సిప్లా, హెటెరో, టోరెంట్ , ఆప్టిమస్ సహా 13 కంపెనీలు ఉన్నాయి. మోల్నుపిరవిర్‌కు చెందిన ఫార్మా కంపెనీలు తయారు చేసే క్యాప్సూల్స్‌ ధర ఒక్కో క్యాప్సూల్‌కు రూ.35 నుంచి రూ.63 వరకు ఉండనుంది.

మొలనుపిరవిర్ డ్రగ్ అంటే ఏమిటి, ఇది వైరస్ నుంచి ఎలా రక్షిస్తుంది. ఎవరు తీసుకోవచ్చు, ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవే..

అది ఎలా పని చేస్తుంది..

ఇది యాంటీవైరల్ మందు. ఈ ఔషధం ఫ్లూ అంటే ఇన్ఫ్లుఎంజా చికిత్సకు అభివృద్ధి చేయబడింది. ఇది నోటి ద్వారా తీసుకునే మందు. ఇది కోవిడ్-19 తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్న రోగులపై ఉపయోగించబడుతుంది. ఇది మొత్తం ఐదు రోజుల కోర్సు.. అది కూడా వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి.

ఇది ఎలా పని చేస్తుందంటే.. 

కరోనా వైరస్ వైరస్ సంక్రమణ జరగకుండా “మొలనుపిరవిర్” నిరోధిస్తుంది. వైరస్ శరీరంలోకి చేరినప్పుడు అది దాని జన్యువును పెంచుకుంటూ పోతుంది. వాటి సంఖ్య పెరిగేకొద్దీ అవి క్రమంగా శరీరం అంతటా వ్యాపిస్తాయి.  మొలనుపిరవిర్ మెడిసిన్ శరీరంలోకి చేరినప్పుడు.. అది కరోనా సోకిన కణాల ద్వారా గ్రహించబడుతుంది. మనం తీసుకున్న మెడిసిన్  కారణంగా సోకిన కణాలలో ఒక రకమైన లోపం ఏర్పడుతుంది.  వైరస్ తన సంఖ్యను పెంచుకోలేకపోతుంది. అందువల్ల  ఔషధ ప్రభావం మొత్తం శరీరంపై ఉన్నప్పుడు వైరస్ నియంత్రణలోకి వస్తుంది. శరీరంలో వైరల్ భారం తగ్గడం ప్రారంభమవుతుంది.

మొలనుపిరవిర్ ప్రభావవంతంగా ఎంత.. 

ఇప్పటికే ఈ మెడిసిన్‌ను కోవిడ్ బాధితులపై ప్రయోగాత్మకంగా టెస్ట్ చేశారు. అయితే ట్రయల్ ఫలితాలు నవంబర్ 2021లో వెల్లడయ్యాయి. ఈ ఔషధం ఇవ్వని రోగులలో 14 శాతం మంది ఆసుపత్రిలో చేరి.. తిరిగి కోలుకోలేక పోయారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.అదే సమయంలో మోల్నుపిరవిర్ మెడిసిన్ తీసుకున్న బాధితుల్లో 7.3 శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది.

ఈ ఔషధాన్ని అమెరికన్ ఫార్మా కంపెనీ మెర్క్ తయారు చేసింది. మెర్క్ తయారు చేసి మొలానుపిరవిర్‌పై క్లినికల్, ప్రీ-క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. వారు చేపట్టిన ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. కోవిడ్ వేరియంట్‌లలో డెల్టా, గామా బాధితులపై ఈ మెడిసిన్ ప్రభావం అధికంగా ఉంది.

ఈ ఔషధాన్ని ఎవరు తీసుకోవచ్చు?

దేశంలో మోల్నుపిరవిర్ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించడానికి ఆమోదించబడింది. ఈ ఔషధం వేగంగా పెరుగుతున్న ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉన్న అటువంటి పెద్దల రోగులపై ఉపయోగించబడుతుంది. ఈ ఔషధం వైద్యుల ప్రిస్క్రిప్షన్‌పై మాత్రమే మెడికల్ స్టోర్‌లో అందుబాటులో ఉంటుంది.

Telangana Bandh: 317 జీవోను పునఃసమీక్షించాలని ఈ నెల 10న తెలంగాణ బంద్‌.. పిలుపునిచ్చిన బీజేపీ

Akkineni Nagarjuna: సినిమా టిక్కెట్ల వివాదంపై హీరో నాగార్జున కీలక వ్యాఖ్యలు..