AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

న‌గ‌రంలో కరోనా కంటైన్మెంట్ల ఎత్తివేత

ఏప్రిల్ 28 నాటికి దేశంలో సుమారు 30 వేల కరోనా కేసులు నమోదు కాగా.. మే 18 నాటికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 40 వేలకు చేరే అవకాశం ఉందని తాజా అధ్య‌య‌నం చెబుతోంది. ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తి నుంచి కోవిడ్ సోకే ముప్పు (రీప్రొడక్షన్ రేటు) 1.92 నుంచి 1.85కి తగ్గుతుందని నివేదిక‌ తెలిపింది. తెలంగాణ సహా దేశంలోని ఆరు ప్రధాన రాష్ట్రాల్లో మే 3న లాక్‌డౌన్ ఆంక్షలను సడలించే పరిస్థితి […]

న‌గ‌రంలో కరోనా కంటైన్మెంట్ల ఎత్తివేత
Jyothi Gadda
|

Updated on: Apr 29, 2020 | 10:45 AM

Share

ఏప్రిల్ 28 నాటికి దేశంలో సుమారు 30 వేల కరోనా కేసులు నమోదు కాగా.. మే 18 నాటికి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 40 వేలకు చేరే అవకాశం ఉందని తాజా అధ్య‌య‌నం చెబుతోంది. ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తి నుంచి కోవిడ్ సోకే ముప్పు (రీప్రొడక్షన్ రేటు) 1.92 నుంచి 1.85కి తగ్గుతుందని నివేదిక‌ తెలిపింది. తెలంగాణ సహా దేశంలోని ఆరు ప్రధాన రాష్ట్రాల్లో మే 3న లాక్‌డౌన్ ఆంక్షలను సడలించే పరిస్థితి ఉంటుందని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. ఇక హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో ప‌లు చోట్ల ఇప్ప‌టికే లాక్‌డౌన్ స‌డ‌లింపు, కంటైన్మెంట్ల తొల‌గింపు చేప‌ట్టారు అధికారులు.

హైదరాబాద్‌ నగర పరిధిలో పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టడంతో కంటైన్మెంట్‌ కేంద్రాలను ఒక్కొటొకటిగా ఎత్తివేస్తున్నారు. చార్మినార్‌ జోన్‌ పరిధిలోని చాంద్రాయణగుట్ట, చార్మినార్‌, ఫలక్‌నుమా, రాజేంద్ర నగర్‌లోని క్వారంటైన్ సెంట‌ర్ల‌ను వరుస క్రమంలో తొలగించారు. చాంద్రాయణ గుట్ట సర్కిల్‌లో గతంలో 35 పాజిటివ్‌ కేసులు ఉండగా, 10 కట్టడి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటిలో 3 కేంద్రాలను తొలగించారు. చార్మినార్‌ సర్కిల్‌లో 16 పాజిటివ్‌ కేసులు ఉండగా 9 కట్టడి కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో ఒక కేంద్రాన్ని తొలగించారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 9 పాజిటివ్‌ కేసులు ఉండగా 7 కేంద్రాలు ఉండేవి. ఇక్కడి 5 కట్టడి కేంద్రాలను తొలగించారు. ప్రస్తుతం రెండు కట్టడి కేంద్రాలు ఉన్నాయి.
లాక్‌డౌన్‌ కారణంగా సికింద్రాబాద్‌ సంగీత్‌ చౌరస్తాలో పూర్తిస్థాయిలో కట్టడి చేశారు. మెట్టుగూడ, ఆలుగడ్డబావి నుంచి సికింద్రాబాద్‌ వైపు వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వడంలేదు. ఆసుపత్రికి వెళ్లే వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు. సంగీత్‌ చౌరస్తాలో గోపాలపురం స్టేషన్‌ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.