మరో అయిదు నెలల్లో కరోనాకు వ్యాక్సిన్…!
సెప్టెంబర్ నాటికి కరోనాకు విరుగుడు తయారవుతుందా..? పరిశోధనలు ఫలించి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా..? అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన నేపథ్యంలో..అవి సత్ఫలితాలనివ్వాలని..ఆ ప్రాణాంతక మహమ్మారికి చెక్ పెట్టాలని కోరుకుంటున్నారు. ఐతే తాజాగా ఆక్స్‌ఫర్డ్ అనుబంధ సంస్థ జెన్నర్ ఇనిస్టిట్యూట్.. ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్‌కల్లా టీకాను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. తాము చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ మెరుగైన ఫలితాలనిస్తున్నాయని ప్రకటించింది జెన్నర్ ఇనిస్టిట్యూట్. మోంటానా నేషనల్ […]

సెప్టెంబర్ నాటికి కరోనాకు విరుగుడు తయారవుతుందా..? పరిశోధనలు ఫలించి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా..? అని ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన నేపథ్యంలో..అవి సత్ఫలితాలనివ్వాలని..ఆ ప్రాణాంతక మహమ్మారికి చెక్ పెట్టాలని కోరుకుంటున్నారు. ఐతే తాజాగా ఆక్స్‌ఫర్డ్ అనుబంధ సంస్థ జెన్నర్ ఇనిస్టిట్యూట్.. ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్‌కల్లా టీకాను అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. తాము చేపట్టిన క్లినికల్ ట్రయల్స్ మెరుగైన ఫలితాలనిస్తున్నాయని ప్రకటించింది జెన్నర్ ఇనిస్టిట్యూట్. మోంటానా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో.. జెన్నర్ తయారుచేసిన టీకాలను..మకావ్ కోతులపై ప్రయోగించారు. అవి 28 రోజుల తర్వాత కోలుకున్నాయని..వాటిని విశ్లేషిస్తున్నామని పేర్కొంది. ఆక్స్‌ఫర్డ్ ప్రయోగాల ఫలితాలను గమనిస్తే.. వ్యాక్సిన్ తయారీలో చాలా ముందున్నామని అంటోంది. జన్యు పరివర్తనను కూడా తమ వ్యాక్సిన్ ఎదుర్కొంటుందని తెలిపింది.
వచ్చే నెలలో మరో 6 వేలమందిపై ప్రయోగానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది జెన్నర్. ఈ టీకా కరోనాపై ప్రభావవంతంగా పనిచేస్తుందని..ఎలాంటి హానీ ఉండే అవకాశం లేదని ఆశాభావం వ్యక్తం చేశారు పరిశోధకులు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే సెప్టెంబర్ కల్లా లక్షల డోసులు సిద్ధం చేస్తామని స్పష్టం చేశారు.




