యుద్ధ యోధుడిని ఓడించిన‌ కరోనా…

అతడు రెండో ప్రపంచ యుద్ద యోధుడు.. కొద్ది రోజుల క్రితమే వందో పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఇంకో పదేళ్లయినా బతుకుతానని చెప్పుకునేవాడు. దురదృష్టవశాత్తు కరోనా బారిన పడి కన్ను మూశాడు.. మరణించిన తమ తాత ఫిలిప్ కాహ్న్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు వారసులు. ఫిలిప్ కాహ్న్ కవల సోదరుడు శ్యామూల్ అప్పట్లో స్పానిష్ ఫ్లూతో మరణించడం విశేషం..న్యూయార్క్ వెస్ట్ బేబీలోన్ కు చెందిన ఫిలిప్ కాహ్న్ అమెరికా సైన్యంలో సేవలు అందించారు. రెండో ప్రపంచ యుద్దంలో కూడా […]

  • Ram Naramaneni
  • Publish Date - 10:46 am, Wed, 29 April 20
యుద్ధ యోధుడిని ఓడించిన‌ కరోనా...

అతడు రెండో ప్రపంచ యుద్ద యోధుడు.. కొద్ది రోజుల క్రితమే వందో పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఇంకో పదేళ్లయినా బతుకుతానని చెప్పుకునేవాడు. దురదృష్టవశాత్తు కరోనా బారిన పడి కన్ను మూశాడు.. మరణించిన తమ తాత ఫిలిప్ కాహ్న్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు వారసులు. ఫిలిప్ కాహ్న్ కవల సోదరుడు శ్యామూల్ అప్పట్లో స్పానిష్ ఫ్లూతో మరణించడం విశేషం..న్యూయార్క్ వెస్ట్ బేబీలోన్ కు చెందిన ఫిలిప్ కాహ్న్ అమెరికా సైన్యంలో సేవలు అందించారు. రెండో ప్రపంచ యుద్దంలో కూడా పాల్గొన్నారు. కానీ తన వందో ఏట కరోనా మహమ్మారి భారిన పడ్డారు. ఫిలిప్ కాహ్న్ కు శామ్యూల్ అనే ఒక కవల సోదరుడు కూడా ఉండేవాడు. ఇప్పుడు కరోనా అందరినీ వణికించినట్లే స్పానిష్ ఫ్లూ అప్పటి తరాన్ని భయపెట్టింది. ఫిలిప్ కాహ్న్ ఎప్పుడూ తన సోదరుడు శామ్యూల్ ను తలచుకునేవాడని, రెండో ప్రపంచ యుద్దానికి సంబంధించిన విషయాలు తమతో పంచుకునేవారడని గుర్తు చేసుకునేవాడని చెబుతున్నారు ఆయన మనవడు వారెన్ జిస్మాన్.

అమెరికాను తీవ్రంగా వణికిస్తున్న కరోనాకు సంబంధించిన వార్తలను ఫిలిప్ కాహ్న్ ఆసక్తిగా వినేవాడు.. కరోనా, కరోనా అని అంటుండేవాడు. చివరకు ఆ మహమ్మారి ఫిలిప్ ను కూడా పొట్టన పెట్టుకుంది. అస్వస్థతతో పరీక్షలు చేయించుకున్న తమ పాత రిజల్ట్ రాకముదే చనిపోయాడని చెబుతున్నారు వారెన్ జిస్మాన్. ఫిలిప్ కాహ్న్ ఇటీవలే తన వందో పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఎంతో ఆరోగ్యంగా ఉండే ఫిలిప్ మరో పదేళ్లు బతుకుతానని ధీమాగా ఉండేవారు.. కానీ కరోనా కాటుకు బలైపోయాడు..ఫిలిప్ కాహ్న్ సైన్యం నుంచి రిటైర్ అయిన తర్వాత విద్యుత్ శాఖలో చేరి వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణంలో కూడా పాల్పంచుకున్నారు. ఆయన లేని లోటు తమ కుటుంబానికి పూడ్చలేనిదని గుర్తు చేసుకున్నారు ఫిలిప్ కాహ్న్ మనవడు వారెన్ జిస్మాన్, మనవరాలు కోరీ కార్లిన్ జిస్మాన్.