మూడు పాజిటివ్ కేసులు నమోదైతే అపార్ట్‌మెంట్ మొత్తం కంటైన్మెంట్ జోన్.. కరోనా కట్టడికి BBMP కీలక నిర్ణయం
Karnataka Covid Cases: కర్ణాటకలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా బెంగుళూరు(Bengaluru)లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి.
Karnataka Covid Cases: కర్ణాటకలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా బెంగుళూరు(Bengaluru)లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. బెంగుళూరులో పాజిటివిటీ రేటు 16 శాతంగా ఉంది. కర్ణాటకలో ఇది 11శాతంగా ఉంది. మంగళవారంనాటితో పోల్చితే బుధవారంనాటు కర్ణాటకలో కోవిడ్-19 (Covid-19) పాజిటివ్ కేసుల సంఖ్య 50శాతం పెరిగింది. కర్ణాటకలో 21,390 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. ఒక్క బెంగుళూరులోనే 15,617 కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్ణాటకలో యాక్టివ్ కేసుల సంఖ్య లక్షకు చేరువగా.. 93,099కి చేరింది. ఇందులో 78శాతం (73,654) బెంగుళూరులో ఉన్నవే. రాష్ట్రంలో 10 మంది కరోనా బారినపడి మృతి చెందగా వీరిలో ఏడుగురు బెంగుళూరుకు చెందినవారే ఉన్నారు.
ఈ నేపథ్యంలో కరోనా కట్టడి దిశగా బృహత్ బెంగళూరు మహానగర పాలికె(BBMP) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బెంగుళూరులోని ఏదైన అపార్ట్‌మెంట్‌లో మూడుకు పైగా కోవిడ్-19 కేసులు నమోదైతే.. మొత్తం అపార్ట్‌మెంట్‌ను ‘కంటైన్మెంట్ జోన్’గా ప్రకటించనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. వారం రోజుల పాటు సదరు అపార్టుమెంట్‌ను కంటైన్మెంట్ జోన్‌లో ఉంచనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే అపార్ట్‌మెంట్‌లో ఉన్న అందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి, కాంట్రాక్ట్ ట్రేసింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ నిర్ణయానికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
క్వారంటైన్‌లో ఉండాల్సిన వ్యక్తులు రోడ్డు మీద ఇష్టానుసారం సంచరించకుండా చూడాల్సిన బాధ్యత రెసిడెన్షియల్ వెల్ఫేర్ అపార్ట్‌మెంట్ల మీదే ఉంటుందని బీబీఎంపీ తెలిపింది. థర్డ్ వేవ్‌లో బెంగళూరులో 212 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. వీరిలో 12 మంది ఇప్పటికే కోలుకోగా.. మిగిలినవారు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఫస్ట్ వేవ్‌లో 4,083 మంది పోలీసులు, సెకండ్ వేవ్‌లో 1,905 మంది పోలీసులు కోవిడ్ బారినపడ్డారు.
కర్ణాటక సీఎం బసవరాజ బొమ్మై, కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీ తదితరులు కరోనా బారినపడ్డారు.
Also Read..
Omicron Alert: బీ అలర్ట్.. ఒమిక్రాన్ వేరియంట్‌తో వారికి ముప్పు.. షాకింగ్ విషయాలు వెల్లడి
UP Elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. పార్టీ వీడిన మరో మంత్రి..