UP Elections 2022: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ మీద దెబ్బ.. పార్టీ వీడిన మరో మంత్రి..
Uttar Pradesh Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.

Uttar Pradesh Elections 2022: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార బీజేపీ దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బీజేపీ నుంచి ఇతర పార్టీలకు వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో మంత్రి బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించాడు. యోగి సర్కార్‌లో మంత్రిగా ఉన్న ధరమ్ సింగ్ సైనీ తన ఎమ్మెల్యే, మంత్రి పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. దాంతో ఇప్పటి వరకు ముగ్గురు మంత్రులు బీజేపీని వీడినట్లయ్యింది. ఇవాళ ఒక్కరోజే నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్‌బై చెప్పగా.. మొత్తంగా 13 మంది ఎమ్మెల్యేలు యోగికి హ్యాండ్ ఇచ్చారు. కాగా, ధరమ్ సింగ్ సైనీ ఏ పార్టీలో చేరుతారనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు పార్టీని వీడిన వారిలో మెజార్టీ సభ్యులు సమాజ్ వాద్ పార్టీలో చేరారు. ధరమ్ సింగ్ కూడా ఎస్పీ బాటపడుతారనే టాక్ వినిపిస్తోంది.
UP Minister Dharam Singh Saini resigns pic.twitter.com/Ey7fxThUtN
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 13, 2022
Also read:
Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో పూజ గది ఎటువైపు ఉంటే మంచిది.. లేకుంటే..
IND vs SA: విరాట్ కోహ్లీకి ప్రత్యేక హోదా తెచ్చిన భారత పేస్ బౌలర్లు.. అదేంటో తెలుసా?