Pushpa: The Rise: ప్లేస్ ఏదైనా తగ్గేదే లే అంటున్న పుష్ప రాజ్.. నేపాల్ లో పుష్ప క్రేజ్ చూస్తే మతి పోవాల్సిందే..
రోజులు గడుస్తున్నా పుష్ప రాజ్ జోరు మాత్రం తగ్గడంలేదు.. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
Pushpa: The Rise: రోజులు గడుస్తున్నా పుష్ప రాజ్ జోరు మాత్రం తగ్గడంలేదు.. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుకుమార్ స్టైల్ మేకింగ్.. అల్లు అర్జున్ యాక్టింగ్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. నార్త్ నుంచి మొదలు సౌత్ వరకు పుష్ప రాజ్ ఒక అలజడిని సృష్టించాడు. తనదైన నటనతో బన్నీ ఒక్కసారి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నారు.ఎప్పుడూ స్టైలిష్ లుక్‌లో కనిపించే బన్నీ తొలిసారి పూర్తి మాస్ మేకోవర్‌లో కనిపించి అలరించారు. ఇక మొదటి పార్ట్ కే విపరీతమైన రెస్పాన్స్ రావడంతో పార్ట్ 2 పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బన్నీ స్మగ్లర్ గా నటించి ఆకట్టుకున్నాడు. మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ పాత్రలో నటించి మెప్పించాడు. ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల్లో విపరీతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది పుష్ప.
ఇక పుష్ప సినిమాలు విదేశాల్లోనూ విపరీతమైన రెస్పాన్స్ దక్కుతుంది. ఇప్పటికే అక్కడ కూడా భారీ హిట్ అని ముద్ర వేసుకుంది పుష్ప సినిమా. ఇక ఈ సినిమా రీసెంట్ గా ఓటీటీలో విడుదల అయ్యింది. వర్షన్ మాత్రం రిలీజ్ చేయలేదు. తాజాగా నేపాల్ లో హిందీ వర్షన్ సినిమా విడుదలైంది. అక్కడ విడుదలైన అన్ని థియేటర్ల వద్ద హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అంతేకాదు థియేటర్ల వద్ద జనం కిక్కిరిస్తున్నారు. ఇందుకు సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Flix One Kathamandu Nepal Class Mass A B C all Centres lo Audience ni Pull Chesi Fulls Pedthunav anna Without Promotions idekkadi mass anna @alluarjun #PushpaHindi pic.twitter.com/z5Zzb3LeEQ
— T??ʀᴜɴ འaل KᴜᴍⒶR (@TarunRajKumarAA) January 12, 2022
మరిన్ని ఇక్కడ చదవండి :