PM Modi Review Meeting: కోవిడ్ వ్యాప్తి, నివారణా చర్యలపై సీఎంలతో ప్రధాని వర్చువల్ సమావేశం..
Omicron - PM Modi: దేశంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే కరోనా(Corona) పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల దాటడంతో కేంద్ర ప్రభుత్వం
Omicron – PM Modi: దేశంలో కేవలం నెల రోజుల వ్యవధిలోనే కరోనా(Corona) పాజిటివ్ కేసుల సంఖ్య 2 లక్షల దాటడంతో కేంద్ర ప్రభుత్వం(Indian Government) అలర్ట్ అయ్యింది. కోవిడ్ 19 పరిస్థితులపై ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశం(Review Meeting) నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తిని నియంత్రించడానికి రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ వర్చువల్ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియ, రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు అన్ని రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. అలాగే కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో.. అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రులు, బెడ్స్, మెడిసిన్స్, ఆక్సీజన్, ఇతర మౌలిక వసతులను సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అలాగే వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. యుక్త వయస్కుల వారికి కూడా వ్యాక్సిన్ వేగంగా వేయాలని దిశానిర్దేశం చేశారు ప్రధాని రేంద్ర మోదీ.
వ్యాక్సినేషన్‌లో ఏపీ టాప్.. ఇదిలాఉంటే.. ఈ వర్చువల్ సమావేశంలో దేశంలో కోవిడ్‌విస్తరణ పరిస్థితులను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రజంటేషన్‌ద్వారా వివరించింది. 15-18 ఏళ్ల మధ్య వయస్సు వారికి అధికంగా వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రాల్లో ఏపీ టాప్‌లోని నిలిచిందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మొదటి డోస్ 100శాతం పూర్తిచేసిన రాష్ట్రాల్లో ఏపీ ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
#WATCH | Prime Minister Narendra Modi starts a virtual meeting with CMs to review the COVID19 situation in their respective states
(Source: Prime Minister’s Office) pic.twitter.com/I2HOM0xgrd
— ANI (@ANI) January 13, 2022
Also read:
Nagarjuna Akkineni : బంగార్రాజుకు కూడా సీక్వెల్ రానుందా..? క్లారిటీ ఇచ్చిన కింగ్ నాగార్జున
TOP 9 ET News: బన్నీ సినిమాపై నార్త్‌లో ఆందోళన | RRR వాయిదా పై చెర్రీ కీలక వ్యాఖ్యలు.. వీడియో
Guwahati-Bikaner Express Derails: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఎగిరిపడ్డ బోగీలు..