Indian Army New Uniform: హై టెక్నాలజీతో ఇండియన్ ఆర్మీ యూనిఫామ్‌.. ఎలా తయారు చేశారో తెలుసా..

భారత ఆర్మీ ఆధునికతో దూసుకుపోతోంది. భారతీయ సైన్యం జనవరి 15న ఆర్మీ డే రోజున కొత్త డిజిటల్ ప్యాటర్న్ బ్యాటిల్ యూనిఫామ్‌ను ఆవిష్కరించనుంది. ఇది తేలికగా, పర్యావరణానికి..

Indian Army New Uniform: హై టెక్నాలజీతో ఇండియన్ ఆర్మీ  యూనిఫామ్‌.. ఎలా తయారు చేశారో తెలుసా..
New Indian Army Uniform Min
Follow us

|

Updated on: Jan 13, 2022 | 6:51 PM

భారత ఆర్మీ ఆధునికతో దూసుకుపోతోంది. భారతీయ సైన్యం జనవరి 15న ఆర్మీ డే రోజున కొత్త డిజిటల్ ప్యాటర్న్ బ్యాటిల్ యూనిఫామ్‌ను ఆవిష్కరించనుంది. ఇది తేలికగా, పర్యావరణానికి అనుకూలమైనదిగా ఉంటుంది. కొత్తగా తీసుకొస్తున్న యూనిఫాం “డిజిటల్” నమూనాను కలిగి ఉంటుంది. జనవరి 15 న ఆర్మీ డే పరేడ్‌లో ఆవిష్కరించబడుతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

గత ఆర్మీ కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో కొత్త ఆర్మీ యుద్ధ సామగ్రిని ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆధునిక ఆర్మీ యూనిఫామ్ ప్రస్తుత దుస్తులు నుండి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. భారత ఆర్మీ దళాలు తమ షర్టులను టక్ చేయాల్సిన అవసరం లేదు.

కొత్త దుస్తులలో మట్టి రంగు, ఆలివ్‌తో సహా అనేక రకాల రంగులు ఉన్నాయి. ఈ యూనిఫామ్‌ను పూర్తి స్వదేశీ టెక్నాలజీతో, స్వదేశీ సంస్థలు రెడీ చేశాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT) ద్వారా సైన్యంతో సన్నిహిత సహకారంతో రూపొందించబడింది. యూనిఫాం, సైనికులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా చూడడమే కొత్త ఆర్మీ యూనిఫామ్ లక్ష్యంగా ఉంది.

ఇవి కూడా చదవండి: Train Ticket Lost: రైలు ప్రయాణానికి ముందు కన్ఫర్మ్ టికెట్ పోతే.. తిరిగి ఇలా తీసుకోండి..

AP Corona Cases: ఏపీలో మరోసారి పెరిగిన కొత్త కోవిడ్ కేసులు.. ఆ రెండు జిల్లాల్లో మాత్రం..