Viral Video: సినిమా స్టైల్ ఛేజింగ్ సీన్.. పారిపోతున్న దొంగను పట్టుకున్న పోలీస్..

Policeman Chase: దొంగలు దోచుకోవడం, పోలీసులు కొద్ది రోజుల తరువాత పట్టుకోవడం కామన్. మరి స్పాట్‌లోనే చేజ్ దొంగలను పట్టుకోవడం ఎప్పుడైనా

Viral Video: సినిమా స్టైల్ ఛేజింగ్ సీన్.. పారిపోతున్న దొంగను పట్టుకున్న పోలీస్..
Follow us
Shiva Prajapati

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 14, 2022 | 3:23 PM

Policeman Chase: దొంగలు దోచుకోవడం, పోలీసులు కొద్ది రోజుల తరువాత పట్టుకోవడం కామన్. మరి స్పాట్‌లోనే చేజ్ దొంగలను పట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? సినిమాలో చూశాం అని అంటారా?. ఒకవేళ మీ సమాధానం అదే అయితే.. ఒక్కసారి ఈ పోలీస్ ధైర్య సాహసాలు చూసేయండి. ఒక దొంగను ఎలా చేజ్ పట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళితే.. మంగళూరులో బుధవారం నాడు ఓ మహిళ మొబైల్ ఫోన్‌ను దొంగ చోరీ చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోతుండగా బాధితురాలు కేకలు వేసింది. అది పసిగట్టిన అసిస్టెంట్ పోలీస్ సబ్ ఇన్‌స్పె్క్టర్.. ఆ దొంగను వెంబడించారు. దొంగను పట్టుకుని బంధించారు. కాగా, పోలీసు అధికారి దొంగను చేజ్ చేస్తుండగా కొందరు వీడియో తీశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది.

దొంగను పట్టుకున్న సబ్ ఇన్‌స్పెక్టర్‌ను మంగళూరు కమిషనర్ ఎన్ శశికుమార్ ప్రశంసించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

Also read:

Pregnancy Care: మీరు అమ్మ కాబోతున్నారా.. వీటికి దూరంగా ఉండండి.. అవేంటో తెలుసా..

Health Benefits of Desi Ghee: దేశీ ఆవు నెయ్యి ఎందుకు తినాలో.. లాభాలు ఏంటో తెలుసుకోండి..

Watch Video: ఒక బంతికి రెండు షాట్లు.. దటీజ్ పంత్.. దక్షిణాఫ్రికా పేసర్ ఆగ్రహానికి గట్టిగా రిప్లై ఇచ్చిన భారత కీపర్..!