Viral Video: ముందు 6 సింహాలు.. వెనుక తోక పట్టుకుని నడుస్తోన్న మహిళ.. చూస్తే బాబోయ్ అంటారు!
సాధారణంగా సింహాలను దూరంనుంచి చూస్తేనే భయంతో వణుకు పుడుతుంది. అవి ఒక్కసారి గర్జించాయా..
సాధారణంగా సింహాలను దూరంనుంచి చూస్తేనే భయంతో వణుకు పుడుతుంది. అవి ఒక్కసారి గర్జించాయా.. చలిజ్వరమే.. అలాంటిది ఓ మహిళ సింహాల సమూహంతో కలిసి నడిచి వెళ్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరు… అవి కూడా ఆడ సింహాలు… ఆ ఆరు సింహాలు రథానికి అశ్వాలు మాదిరిగా ముందు నడుస్తుంటే… వెనుక అపరకాళిమాతలా ఆ మహిళ నడుస్తోంది. నమ్మశక్యంకాని ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు. పెంపుడు కుక్కల్ని వెంటబెట్టుకొని వెళ్లినట్లుగా ఆమె సింహాలను వెంటబెట్టుకొని వెళ్తోంది. ఇది అడవిలో షూట్ చేసిన వీడియో. ఆరు సింహాలు ముందు నడుస్తుంటే… వెనక ఆమె నడుస్తోంది. వాటిలో ఒక్కటి కూడా ఆమెకు హాని చెయ్యట్లేదు. మరో విచిత్రమేంటంటే… ఆమె ఓ సింహం తోక పట్టుకొని కూడా నడిచింది. అప్పుడు కూడా ఆ సింహం ఆమెను ఏమీ అనలేదు.
View this post on Instagram
ఇన్‌స్టాలో safarigallery అనే పేజీలో ఈ వీడియోని జనవరి 11న అప్‌లోడ్ చేశారు. ఇది ఆఫ్రికాలోని కెన్యాలో షూట్ చేసినట్లు చెబుతున్నారు. ఐతే… ఆ సింహాలను ఆమె కుటుంబం పెంచుకుంటోందా… లేకపోతే మొదటి నుంచి ఆ సింహాలు ఆమెకు అలవాటేనా..ట్రైనింగ్ పొందిన సింహాలా అనేది తెలియరాలేదు కానీ.. జింబాబ్వేలోని సఫారీలో పర్యాటకులకు హాని చెయ్యకుండా నడిచేలా సింహాలకు ట్రైనింగ్ ఇచ్చారు. అందువల్ల చాలా మంది టూరిస్టులు… సింహాల పక్కనే నడుస్తూ వీడియో తీయించుకుంటారు. అలాగే ఆమె కూడా ఆరు ఆడ సింహాలతో నడిచిందా అనే అనుమానం కూడా ఉంది. ఇది ఎప్పుడు షూట్ చేశారో కూడా క్లారిటీ లేదు. కానీ ఈ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read:
వీరు జామపండ్లను అస్సలు తినకూడదు.. ఎందుకో తెలుసుకోండి!
ఈ ఫోటోలో పులి దాగుంది.. గుర్తించండి చూద్దాం.. అంత ఈజీ కాదండోయ్!
పాముతో గేమ్సా.. క్షణాల్లో కాటేసింది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!