Viral Video: పాముతో గేమ్సా.. క్షణాల్లో కాటేసింది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!

చావు తప్పి కన్ను లొట్టబోవడం.. అంటే ఇదేనేమో.. సాధారణంగా పాములు కనిపిస్తే చాలు మనుషులు...

Viral Video: పాముతో గేమ్సా.. క్షణాల్లో కాటేసింది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 12, 2022 | 4:47 PM

చావు తప్పి కన్ను లొట్టబోవడం.. అంటే ఇదేనేమో.. సాధారణంగా పాములు కనిపిస్తే చాలు మనుషులు భయంతో పారిపోతారు. అలాంటిది పాములతో పరాచకాలా.. ఒకవేళ అలా చేస్తే సరదా కాస్తా తీరిపోతుంది. వైపర్ స్నేక్(Viper Snake).. అత్యంత విషపూరితమైనది. దీని కాటుకు క్షణాల్లో మనిషి ప్రాణాలు పోవడం ఖాయం. అలాంటిది ఈ విషసర్పంతో ఓ యువకుడు పరాచకాలు ఆడాడు. అందుకు సంబంధించిన వీడియో(Viral Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూశాక మీ వెన్నులో వణుకు పుట్టాల్సిందే.

సోషల్ మీడియాలో ఎంతోమంది ఓవర్ నైట్ స్టార్స్ కావాలని.. ఎక్కువ లైకులు, వ్యూస్ సంపాదించుకోవాలని తహతహలాడుతుంటారు. అందుకోసం వారి ప్రాణాలను సైతం పణంగా పెడుతుంటారు. ఇక అందుకు ఈ వీడియో నిదర్శనం. ఓ ఫ్యాక్టరీ లాంటి ప్రదేశంలో ఈ వీడియో చిత్రీకరించినట్లు మీకు అనిపిస్తుంది. ఇందులో ఓ యువకుడు తన చేతులతో వైపర్ స్నేక్‌ను పట్టుకుని దాని ముఖంపై నిర్భయంగా ఊడుతున్నాడు.

అప్పటికే ఆ పాము పడగ విప్పి కోపంగా బుసలు కొడుతోంది. దాన్ని గమనించకుండా ఆ యువకుడు దానితో పరాచకాలు ఆడుతూనే ఉన్నాడు. అలా ఆ పామును తన తల దగ్గరకు తీసుకొచ్చి ముద్దాడాలని అనుకుంటాడు. అయితే అనూహ్యంగా ఆ పాము యువకుడి తలపై కాటేస్తుంది. దాని పట్టును ఎంత సడలించాలన్నా అతడికి సాధ్యం కాదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తున్నాయి.

కాగా, ఈ వీడియోను ట్విట్టర్‌లో ‘Folico_’ అనే నెటిజన్ అప్‌లోడ్‌ చేశాడు. అతడు గతేడాది డిసెంబర్ 6వ తేదీన ఈ వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు 24 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు. ‘ఆ పాము ఏమి ఆట వస్తువు కాదని’ ఒకరు కామెంట్ చేయగా.. ‘ఆ యువకుడు సరైన గుణపాఠం నేర్చుకుని ఉంటాడని’ మరొకరు కామెంట్ చేశారు.

Also Read:

ఈ ఫోటోలో పాము దాగుంది.. ఈజీగా కనిపెట్టచ్చండోయ్‌.. కష్టం కాదు.!

మద్యం షాప్ దగ్గర ఆగి ఉన్న ఇన్నోవా కారు.. అనుమానంతో డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!