Guwahati-Bikaner Express Derails: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఎగిరిపడ్డ బోగీలు..
Guwahati-Bikaner Express Derails: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని జల్‌పైగురి జిల్లాలోని దోహోమోని ప్రాంతంలో..
Guwahati-Bikaner Express Derails: పశ్చిమ బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని జల్‌పైగురి జిల్లాలోని దోహోమోని ప్రాంతంలో గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబర్ 15633) పట్టాలు తప్పింది. ఈ ఘటనలో రైలు బోగీలు ఒకదానిపైకి మరొకటి దూసుకు వచ్చాయి. మరికొన్ని బోగీలు ట్రాక్ బయటకు వచ్చి పల్టీలు కొట్టాయి.
వివరాల్లోకెళితే.. గౌహతి-బికనీర్ ఎక్స్‌ప్రెస్(15633) ఇవాళ సాయంత్రం 5 గంటల సమయంలో జల్‌పైగురి జిల్లాలోని దోమోహని ప్రాంతంలో పట్టాలు తప్పింది. రైలుకు సంబంధించిన 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక సమాచారం అందుతోంది. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం. ప్రమాదం స్థాయి తీవ్రంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు.
ఈ ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, ఇండియన్ రైల్వే వెంటనే స్పందించాయి. రెస్క్యూ టీమ్ వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. దాదాపు 30 ఆంబులెన్స్‌లలో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలిస్తునప్నారు. చెల్లాచెదురుగా పడిపోయిన రైలు బోగీల్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులను కాపాడేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నిస్తోంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఇదిలాంటే.. ఈ ప్రమాదంపై సమాచారం అందించేందుకు ఇండియన్ రైల్వే హెల్ప్‌లైన్ నంబర్ 8134054999 ను జారీ చేసింది. దీంతో పాటు మరో రెండు హెల్ప్‌లైన్ నంబర్లు – 03612731622, 03612731623 కూడా అందుబాటులో ఉంచింది. కాగా, రైలు ప్రమాదంపై సమాచారం అందుకున్న ప్రధాని మోదీ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడారు. ప్రమాదంపై ఆరా తీశారు.
Guwahati-Bikaner Express 15633 (up) derailed at about 5 pm this evening. Details awaited pic.twitter.com/It93WwAsu8
— ANI (@ANI) January 13, 2022
Also read:
Sankranti – Omicron: పండుగ వేళ డేంజర్ బెల్స్.. తస్మాత్ జాగ్రత్త అంటున్న వైద్యులు.. ఎందుకంటే..
Chiranjeevi – Jagan: సీఎం జగన్‌తో ముగిసిన మెగాస్టార్ భేటీ.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన చిరు..
Gas Adulteration: వంట గ్యాస్ సిలిండర్ల విక్రయాల్లో భారీ మోసం.. ఎలా గుర్తించారంటే..