Sankranti – Omicron: పండుగ వేళ డేంజర్ బెల్స్.. తస్మాత్ జాగ్రత్త అంటున్న వైద్యులు.. ఎందుకంటే..

Sankranti - Omicron: కరోనా మహమ్మారి గతం కంటే వేగంగా కోరలు చాస్తోంది. ఒమిక్రాన్‌గా రూపాంతరం చెందిన ఈ వైరస్.. ఊహించని రీతిలో..

Sankranti - Omicron: పండుగ వేళ డేంజర్ బెల్స్.. తస్మాత్ జాగ్రత్త అంటున్న వైద్యులు.. ఎందుకంటే..
Follow us
Shiva Prajapati

| Edited By: Anil kumar poka

Updated on: Jan 14, 2022 | 1:34 PM

Sankranti – Omicron: కరోనా మహమ్మారి గతం కంటే వేగంగా కోరలు చాస్తోంది. ఒమిక్రాన్‌గా రూపాంతరం చెందిన ఈ వైరస్.. ఊహించని రీతిలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే, ఒమిక్రాన్ వ్యాప్తిపై విశాఖ‌ప‌ట్నంలోని కిమ్స్ ఐకాన్ ఆసుప‌త్రికి చెందిన ఇంట‌ర్నల్ మెడిసిన్ వైద్యనిపుణులు డాక్టర్ ఆర్‌.వి. ర‌వి క‌న్నబాబు కీలక సూచనలు చేశారు. ఒమైక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒమిక్రాన్ ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతోందన్నారు. ముఖానికి, ముక్కుకు నాణ్యమైన మాస్క్ వినియోగించడం, భౌతిక దూరం పాటించడం చేస్తుండాలని సూచించారు.

చాలామంది మాస్కులు పెట్టుకుంటున్నా.. వాటిని ముక్కు కిందకు పెట్టుకుంటున్నారు. అదే అసలు ప్రమాదం అని అన్నారు. ఎన్95 మాస్కులే అవ‌స‌రం లేద‌ని, ఎలాంటిదైనా బాగా కవర్ చేసేలా చూసుకోవాలని ఆయ‌న తెలిపారు. కొవిడ్ థర్డ్ వేవ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఎక్కువ కేసులు న‌మోద‌వుతున్న ప్రాంతాల్లో విశాఖ‌ప‌ట్నం ఒక‌ట‌ని, పండుగ త‌ర్వాత కేసుల సంఖ్య మ‌రింత పెరిగే ప్రమాదం ఉంద‌ని హెచ్చరించారు. ఇప్పటికే వైరస్ వ్యాప్తి మొద‌లైంద‌ని, సంక్రాంతికి ఊళ్లకు వెళ్లక‌పోవ‌డ‌మే మంచిద‌ని సూచించారు. త‌ప్పనిస‌రిగా వెళ్లాల్సి వ‌చ్చినా ఎక్కడా మాస్కు తీయ‌కూడ‌ద‌న్నారు. వేరే ఇంటికి వెళ్లి, మాట్లాడేట‌ప్పుడు మాస్కు తీసినా కొవిడ్ వ‌చ్చే ప్రమాదం ఉంద‌ని హెచ్చరించారు.

అయితే, ప్రస్తుతం నమోదవుతున్న ప్రతి నాలుగు కేసుల్లో ఒక‌టి ఒమైక్రాన్ అవుతోంద‌ని, కొన్ని డెల్టా కేసులూ ఉంటున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అయితే స‌మీప భ‌విష్యత్తులో ఒమైక్రాన్ కేసులు భారీగా న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు. సెకండ్ వేవ్‌లో ఉన్నంత‌గా ఆసుప‌త్రిలో ప్రవేశాలు ఇప్పటికి లేవ‌ని, కానీ ఇంకా విశాఖ ప్రాంతంలో మొద‌ట్లోనే ఉంద‌ని అన్నారు. గొంతులో గ‌ర‌గ‌ర‌లు, జ‌లుబు, ద‌గ్గు, కొద్దిపాటి జ్వరం, నీరసం, త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పుల లాంటి ల‌క్షణాలు ఉంటాయ‌ని చెప్పారు. కొంత‌మంది ఇంటివ‌ద్దే ప‌రీక్షలు చేయించుకుంటున్నార‌ని, వాటిలోనూ పాజిటివ్‌లు బ‌య‌ట‌ప‌డుతున్నాయ‌ని చెప్పారు. కొవిడ్ ల‌క్షణాల్లో ఏ ఒక్కటి క‌నిపించినా వెంట‌నే ప‌రీక్ష చేయించుకోవాల‌ని డాక్టర్ ర‌వి క‌న్నబాబు సూచించారు. ఒక‌వేళ పాజిటివ్ అని తెలిస్తే వైద్యులు సూచించిన మందులు వాడ‌టంతో పాటు త‌గిన‌న్ని నీరు తీసుకోవ‌డం, విశ్రాంతిగా ఉండ‌టం, పోష‌కాహారం తీసుకోవ‌డంతో పాటు ఎప్పటిక‌ప్పుడు ఆక్సిజ‌న్ శాచ్యురేష‌న్ త‌ప్పనిస‌రిగా చూసుకోవాల‌న్నారు. ఏదైనా సీరియస్ అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.

అయితే, కరోనా ఎదుర్కోవడంలో టీకా కీలకం అని చెప్పారు డాక్టర్ రవి. కొవిడ్‌లో ఎలాంటి వేరియంట్ వ‌చ్చినా, వ్యాధి తీవ్రత‌రం కాకుండా కాపాడ‌టంలో టీకాల పాత్ర చాలా ముఖ్యమ‌న్నారు. ప్రతి ఒక్కరూ త‌ప్పనిస‌రిగా రెండు డోసుల టీకాలు తీసుకోవాల‌ని సూచించారు. సాధార‌ణ ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్షతోనూ ఒమైక్రాన్‌ను గుర్తించ‌వ‌చ్చని, మూడు ల‌క్షిత జ‌న్యువుల్లో ఒక‌టైన ఎస్ జ‌న్యువు లేక‌పోతే అది ఒమైక్రాన్ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. టీకాలు తీసుకున్నా, తీసుకోక‌పోయినా ప్రతి ఒక్కరూ త‌ప్పనిస‌రిగా భౌతిక దూరం పాటించాల‌ని, మాస్కు ధ‌రించాల‌ని, చేతి శుభ్రత పాటించాల‌న్నారు. స‌మూహాల్లోకి వెళ్లకూడ‌ద‌ని డాక్టర్ ర‌వి క‌న్నబాబు సూచించారు.

Also read:

Alcohol Side Effects: రోజూ మద్యం తాగుతున్నారా.? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

Sunitha: సింగర్ సునీత బర్త్ డే కేక్ కటింగ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Chiranjeevi – Jagan: సీఎం జగన్‌తో ముగిసిన మెగాస్టార్ భేటీ.. ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన చిరు..