Omicron Alert: బీ అలర్ట్.. ఒమిక్రాన్ వేరియంట్‌తో వారికి ముప్పు.. షాకింగ్ విషయాలు వెల్లడి

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో కరోనా కేసుల సంఖ్య దాదాపు 2.47 లక్షలకు చేరాయి.

Omicron Alert: బీ అలర్ట్.. ఒమిక్రాన్ వేరియంట్‌తో వారికి ముప్పు.. షాకింగ్ విషయాలు వెల్లడి
Omicron
Follow us

|

Updated on: Jan 13, 2022 | 11:25 AM

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్(Omicron Varient) దడపుట్టిస్తోంది. ఒమిక్రాన్ విజృంభిస్తుండటంతో కరోనా (Coronavirus) కేసుల సంఖ్య దాదాపు 2.47 లక్షలకు చేరాయి. గత 236 రోజుల్లో నమోదైన అత్యధిక రోజువారీ కేసులు ఇవే. గత ఏడాది మే నెలలో సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే 216 రోజుల తర్వాత దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులు(11,17,531) ఉన్నాయి. అధికారిక సమాచారం మేరకు ఇప్పటి వరకు దేశంలో 5,488 ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారంనాటి వరకు ఈ సంఖ్య 4,868గా ఉంది. ఒక రోజు వ్యవధిలో అదనంగా 630 ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 1367 కేసులు నమోదుకాగా.. రాజస్థాన్‌లో 792, ఢిల్లీలో 549 కేసులు నమోదయ్యాయి. ఇటు తెలంగాణ(Telangana)లో 260, ఏపీ(Andhra Pradesh)లో 61 ఒమిక్రాన్ కేసులు నిర్థారణ అయ్యాయి.

వ్యాక్సిన్ తీసుకోనివారికి ఒమిక్రాన్ గండం.. వ్యాక్సిన్ తీసుకోని వారి పట్ల ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ముంబై(Mumbai) ఆస్పత్రుల్లో ఆక్సిజన్ బెడ్స్‌లో చికిత్స పొందుతున్న 1900 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 96 శాతం మంది కనీసం తొలి విడత వ్యాక్సిన్ కూడా తీసుకోని వారే ఉన్నట్లు బీఎంసీ కమిషనర్ ఇక్బాల్ ఛహల్ తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోని వారి పట్ల ఒమిక్రాన్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టంగా తేటతెల్లంచేస్తున్నట్లు వివరించారు.

ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దు… ఒమిక్రాన్ ప్రభావంపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు ఇది సాధారణ జలుబులాంటిదని అభిప్రాయపడుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌ను తేలిగ్గా తీసుకోవద్దంటూ నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్(Dr VK Paul) హెచ్చరించారు. ఒమిక్రాన్ సాధారణ జలుబుగా భావించడం సరికాదన్నారు. పలు దేశాల్లో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలడానికి ఒమిక్రాన్ కారణమయ్యిందని.. దీన్ని విస్మరించవద్దని సూచించారు. ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు వ్యాక్సినేషన్, మాస్క్‌లు తప్పనిసరని.. ఈ సామాజిక బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. వ్యాక్సినేషన్ భారీ స్థాయిలో జరిగినందునే ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గినట్లు వివరించారు. భారత్ కోవిడ్-19ను ఎదుర్కోవడంలో వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ఇంకా వ్యాక్సిన్లు తీసుకోనివారు.. తక్షణం తీసుకోవాలని కోరారు. హోం ఐసొలేషన్‌లో మందుల అధిక వినియోగం, దుర్వినియోగం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నట్లు చెప్పారు.

టీవీ9 తెలుగు వినతి.. 

కుంటి సాకులతో ఇంకా వ్యాక్సిన్లు తీసుకోని వారు తక్షణమే తీసుకోవాలని టీవీ9 కోరుతోంది. ఇంకా వ్యాక్సిన్ తీసుకోకపోవడమంటే తమ సొంత ప్రాణాలతో చెలగాటం ఆడుకోవడమేనని గుర్తించాలి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో విధిగా మాస్క్ ధరించాలి. తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

Also Read..

PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు మీ బ్యాంకు ఖాతాల్లోకి రాలేదా ? అయితే ఇలా చేయండి..

Coronavirus: దేశంలో కరోనా మహోగ్రరూపం.. ఏకంగా రెండున్నర లక్షలకు చేరువగా..