Coronavirus: దేశంలో కరోనా మహోగ్రరూపం.. ఏకంగా రెండున్నర లక్షలకు చేరువగా..
దేశంలో కరోనా జూలు విదుల్చుతోంది. మూడోవేవ్ ఆందోళనలను నిజం చేస్తూ కుప్పలు తెప్పలుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది
దేశంలో కరోనా జూలు విదుల్చుతోంది. మూడోవేవ్ ఆందోళనలను నిజం చేస్తూ కుప్పలు తెప్పలుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నిన్న రెండు లక్షల మార్క్‌కు చేరువైన కేసులు తాజాగా ఏకంగా రెండున్నర లక్షలకు చేరువ కావడం దేశంలో వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. గడిచిన 24 గంటల్లో (బుధవారం) దేశవ్యాప్తంగా కొత్తగా 2,47,417 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. బుధవారం నమోదైన కేసులతో పోలిస్తే 52,697 ( 27 శాతం) కోవిడ్ కేసులు అధికంగా పెరిగాయని కేంద్రవైద్యారోగ్య శాఖ పేర్కొంది.
216 రోజుల తర్వాత.. కాగా ఈ మహమ్మారి కారణంగా నిన్న మరో 380 మంది మృత్యువాత పడ్డారు. దీంతో దేశంలో కరోనా మరణాల సంఖ్య 4,85,035కు చేరింది. కాగా కొత్త కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,63,17,927 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు దేశంలో వైరస్ పాజిటివిటీ రేటు 13.11 శాతానికి ఎగబాకింది. ఇక కోవిడ్ నుంచి 24 గంటల్లో84,825 కరోనా రోగులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 11,17,531 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో సుమారు 216 రోజుల తర్వాత ఇన్ని క్రియాశీల కేసులుండడం గమనార్హం. మరోవైపు కొత్త వేరియంట్ కూడా దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నిన్న ఒక్కరోజే 620 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కు చేరుకుంది. రాష్ట్రాల వారీగా చూస్తే.. కరోనా వ్యాప్తిలో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. అక్కడ నిన్న ఒక్కరోజే 46,723 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆతర్వాత ఢిల్లీ రెండో స్థానంలో ఉంది. అక్కడ 27,561 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో( 22,155), కర్ణాటక (21,390), తమిళనాడు(17,934 ) రాష్ట్రాలు ఉన్నాయి.
#UPDATE | 380 COVID patients lost lives in India in the last 24 hours, taking the death toll to 4,85,035: Union Health Ministry
— ANI (@ANI) January 13, 2022
Also Read:
Coronavirus: క్రీడల కోసం ఇంతటి క్రూర నిబంధనలా.. విస్తుగొలుపుతోన్న చైనా కరోనా ఆంక్షలు..
Knowledge: గబ్బిలాల ద్వారా వైరస్‌ల సంక్రమణ.. మరి అవెందుకు జబ్బు పడవంటే..
Scholarships: కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..